అబార్షన్ రూమర్లు ఒట్టి అపద్దమే...!!
హాలీవుడ్ ప్రముఖ మోడల్ క్యాటీ ప్రైజ్ అబార్షన్ చేయించుకున్నదని హాలీవుడ్ మొత్తం కోడై కూస్తోంది. ఆమె తన గుర్రాలకు శిక్షణ ఇచ్చే శిక్షకుడు ఆండ్రీ గౌల్డ్ ఆమె గర్బానికి కారకుడని, వారిద్దరూ ఓ రోజు ఎంతో సన్నిహితంగా మెలగటం ద్వారా జరిగిన తప్పుకు ఆమె గర్భం దాల్చిందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తల్లి అయిన క్యాటీ ప్రైజ్ ఆ తర్వాత అబార్షన్ చేయించుకుందట.
కానీ తన మీద వస్తోన్న వార్తలను క్యాటీ ప్రైజ్ కొట్టి పారేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్యూలో ఆమెను ఈ అబార్షన్ గురించి వివరణ అడుగగా "అసలీ ప్రశ్నకు అర్థమే లేదు. ఇలాంటి వార్తలు పుట్టుకురావడం చాలా దారుణమైన చర్య. ఇందులో ఎలాంటి నిజం లేనప్పుడు దాని గురించి నేను స్పందించాల్సిన అవసరం లేదు" అని గట్టిగా చెప్పింది.
కానీ ఈ వార్తలు విన్న వారు మాత్రం ఏ దొంగ తాను దొంగతనం చేసానని ఒప్పుకోడు, ఇదీ అలాంటిదే అని కొట్టిపారేసారు. కానీ క్యాటీ మాత్రం ప్రస్తుతం తన భర్త పీటర్ కు, బాయ్ ఫ్రెండ్ రెయిడ్ కు దూరమయి పబ్ ల్లో పీకల దాకా తాగి తూలుతోందట.


Click it and Unblock the Notifications











