బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అయ్యాయి..!!

By Kuladeep

ప్రముఖ లండన్ మోడల్ క్యాటీ ప్రైజ్ ఆస్ట్రేలియాలోని 'ఐయామ్ సెలబ్రిటీ' రియాలిటీ షోలో పాల్గొనడానికి వెళ్లి షో అనంతరం తను అలెక్స్ రెయిడ్ తో ఇక పై కలసివుండదలచుకోలేదని చెప్పి రెయిడ్ ను సందిగ్ధంలో పడేసింది. ఆ తర్వాత రెయిడ్ బ్రతిమలాడుకోవడంతో తిరిగి అతనితో తిరిగి కలసివుండటానికి అంగీకరించింది. కాగా ఇటీవలే రెయిడ్ బిగ్ బ్రదర్స్ రియాలిటీ షోలో పాల్గొనదలచి ఈ విషయాన్ని క్యాటీకి చెప్పడంతో ఇందుకు ఆమె ఒప్పుకోలేదట. ఎక్కడ రెయిడ్ ఈ రియాలిటీ షోలో ఎవరితోనైనా ఎఫైర్ పెట్టుకుని తనకు దూరం అవుతాడేమోనని ఆమె భయపడుతోందట. ఈ విషయాన్ని అతనే ఈ రియాలిటీ షోలో తన సహచరులకు చెప్పుకున్నాడు. ఆమెను ఎంతో బ్రతిమలాడితే ఈ షోలో పాల్గొనడానికి అంగీకరించిందని అతను చెప్పాడు.

కానీ తాను ఆమెను వదిలేసే ప్రసక్తే లేదని అతను చెప్పాడు. ఇన్నాళ్లు రెయిడ్ ఎక్కడ క్యాటీ తనని వదిలేస్తుందోనని భయపడింది, ఇప్పుడు క్యాటీ స్థానంలోకి రెయిడ్, రెయిడ్ స్థానంలోకి క్యాటీ వచ్చారు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవడం అంటే ఇదేనేమో...!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X