పండగ పూట దాంతో ఎంటీ... రోతగా...!!
ప్రముఖ హాలీవుడ్ మోడల్ క్యాటీ ప్రైజ్ ఇటీవల బ్రిటన్ లో నిర్వహించిన ఓ పోల్ లో మొదటి స్థానంలో నిలిచింది. దీనికి ఆమె ఎంతో బాధపడుతోందట. అదేంటి మొదటి స్థానంలో నిలిచింది కదా...?? మరి బాధపడటం ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా...!! అసలు సంగతి వింటే మీరు కూడా పాపం క్యాటీ అని జాలి పడకుండా వుండలేరు.
ఇంతకీ అసలు సంగతి ఏంటంటే రాబోవు క్రిస్ట్ మస్ పండుగని ఘనంగా జరుపుకోవడానికి బ్రిటన్ మొత్తం సమాయత్తం అవుతోందట. ఇలాంటి సమయంలో మీరు క్రిస్ట్ మస్ పండుగకి ఎవరిని డిన్నర్ కు ఆహ్వానించడానికి ఇష్టపడతారు, ఎవరిని పిలవడానికి ఇష్టపడరు అని ఓ సర్వే నిర్వహించారట.
ఈ సర్వేలే 50% మందికి పైగా క్యాటీని తమతో డిన్నకు ఆహ్వానించడాన్ని అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. అసలు క్యాటీతో కలసి డిన్నర్ చెయ్యడాన్ని మేము ఊహించుకోలేమని వారు అభిప్రాయపడ్డారు. తొలుత పీటర్ ఆండ్రీని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడాకులు ఇవ్వడం... క్రాస్ డ్రెస్సర్ అలెక్స్ రెయిడ్ తో కలసి వుండటం ఆ తర్వాత అతనికి కూడా హ్యాండివ్వడం, ఆ తర్వాత పీటర్ కు దగ్గరవ్వాలని ప్రయత్నించి ఆ ప్రయత్నం బెడిసికొట్టడంతో తిరిగి రెయిడ్ తో కలసిపోవడం లాంటి వాటితో పాటు ఆమె మితిమీరిన అంగాంగ ప్రదర్శన ఆమెను ప్రజానీకం నుండీ దూరం చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











