ప్రేమను తెలిపేందుకు పేరు మార్చుకోనున్న అభినవ ప్రేయసి
లండన్ కు చెందిన ఒకప్పటి ప్రముఖ బేర్ బాడీ మోడల్ క్యాటీ ప్రైజ్ తన భర్త పీటర్ ఆండ్రీకి విడాకులిచ్చి, క్రాస్ డ్రెస్సర్ బిగ్ బ్రదర్స్ రియాలిటీ షో విజేత అలెక్స్ రెయిడ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా రెయిడ్ రియాలిటీ షోలో విజేతగా నిలవక ముందు అతనితో మాట్లాడటానికే ఎన్నో షరతులు పెట్టిన క్యాటీ ఆ తర్వాత హఠాత్తుగా అతన్ని వివాహం చేసుకోవడంతో ఆమె అలెక్స్ కు వచ్చిన డబ్బు కీర్తిని చూసే పెళ్లిచేసుకుందనే విమర్శలు వినిపించాయి. ఆమె ప్రేమ కాదని అవకాశవాదం అని ఆమెను దయ్యబట్టారు.
దీంతో కలత చెందిన క్యాటీ తన ప్రియుడు, భర్త అయిన రెయిడ్ మీదున్న ప్రేమను తెలిపేందుకు తన పేరును క్యాటీ ప్రైజ్ నుండీ క్యాటీ రెయిడ్ గా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ వార్త విన్న ఆమె సన్నిహితులు మాత్రం క్యాటీ ప్రైజ్ అంటే అందరికీ తెలిసిన పేరని, దాన్ని మార్చేస్తే అది ఆమె బ్రాండ్ కే నష్టమని హితవు పలుకుతున్నారట. మరి క్యాటీ ఏ నిర్ణయం తీసుకోనుందో...!?


Click it and Unblock the Notifications











