నేను నా బాయ్ ఫ్రెండ్ ను పెళ్లిచేసుకోను... !!
ప్రముఖ హాలీవుడ్ మోడల్ క్యాటీ ప్రైజ్ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందట. ఎవరినీ ఆమె బాయ్ ప్రెండ్ అలెక్స్ రెయిడ్ నే కదా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. పీటర్ నుండీ విడిపోయాకా ఇంత వరకూ తనకు సరిపోయే మగాడు దొరకలేదని, కానీ దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటానని క్యాటీ ప్రకటించింది. 2005 వ సంవత్సరంలో ఆస్ట్రేలియాకు చెందిన గాయకుడు పీటర్ ఆండ్రీని వివాహమాడిన క్యాటీ ఈ ఏడాది ప్రథమార్థంలో అతడి నుండీ విడాకులను తీసుకొని, జులై మాసం నుండీ బాక్సర్ అలెక్స్ రెయిడ్ తో డేటింగ్ చేస్తోంది. కాగా ఇటీవల "అయామ్ సెలబ్రిటీ" అనే రియాలిటీ షో పాల్గొనడానికి ఆస్ట్రేలియా వెళ్లిన క్యాటీ ఈ షోలో తన సహచరిణి అయిన సబ్రినా వాషింగ్టన్ తో మాట్లాడుతూ "ప్రస్తుతం నాకు 31ఏళ్లు, నాకు పీటర్ నుండీ విడిపోయాకా సరైన మగాడు దొరకలేదు. దొరికితే వెంటనే పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడాలని అనుకుంటున్నట్టు" తెలిపింది.
మరి క్యాటీతోనే తన జీవితం అంటూ ఆమె తన నుండీ కొన్ని రోజులు దూరంగా వెళ్లడంతో విరహవేదనతో రగిలిపోతున్న రెయిడ్ సంగతేంటో....


Click it and Unblock the Notifications











