తనవి బయటపెడతాడేమోనని భయపడుతోంది...!!
ఒకనాటి ప్రముఖ మోడల్ క్యాటీ ప్రైజ్ ఇటీవలే 'అయామ్ సెలబ్రిటీ గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్' అనే రియాలిటీ షోలో పాల్గొనడానికి ఆస్ట్రేలియా వెళ్లి తనికపై తన బాయ్ ఫ్రెండ్ అలెక్స్ రెయిడ్ తో కలసి వుండబోవడం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతే కాదు ఇంటికి తిరిగి వచ్చిన ఆమె రెయిడ్ తో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. ఇకపై నీతో వుండలేనని, నువ్వు నా మనోభావాలని గౌరవించలేదని, ఇక్కడి నుండీ వెళ్లిపొమ్మని గట్టిగా చెప్పిందట. ఇంతా చేసిన క్యాటీ ఎక్కడ రెయిడ్ తనతో సన్నిహితంగా వున్నప్పుడు తీసిన ఫోటోలు బయటపెడతాడో అని భయపడుతోందట. ఈ ఫోటోల వల్ల తన కెరీర్ కు దెబ్బ తగలటమే కాకుండా, తిరిగి తన భర్త పీటర్ ఆండ్రీతో కలసిపొవాలనే తన ఆశలపై నీళ్లు చల్లుతాయోనని భయపడుతోందట.
ఇక క్యాటీ ప్రైజ్ తన ముగ్గురు పిల్లలను వదలి వుండలేకే 'అయామ్ సెలబ్రిటీ గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్' రియాలిటీ షో నుండీ నిష్క్రమించానని చెప్పుకొచ్చింది. ఈమె షో నుండీ నిష్క్రమించడంతో ఈ షో రేటింగ్ 20% శాతం పడిపోయిందట.


Click it and Unblock the Notifications











