నాకు కూతురు అంటే ఎనలేని ప్రేమ అందుకే..
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిలా జోవోవిచ్ ఎప్పుడైనా అలా సరదాగా, విహార యాత్రలకు వెళ్లాలని అనుకున్నప్పుడు తన నాలుగు సంవత్సరాల కూతరుతో వెళ్లడానికి ఇష్టపడతానని తెలిపారు. 35సంవత్సరాల వయసు కలిగిన మిలా జోవోవిచ్ డైరెక్టర్ పాల్ ఆండ్రసన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి ముద్దుల పాపాయి ఎవర్ గ్రాబో. ప్రంపచంలో ఉన్న వివిధ సంసృతులను, భాషలను తెలుసుకునేందుకు గాను సరదాగా తన కూతురుతో ట్రిప్‌కి ప్లాన్ చేసినట్లు తెలిపారు.
ఈ సందర్బంలో మిలా జోవోవిచ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మా చిట్టి తల్లి ఎవర్ గ్రాబో నివసించిన ప్రదేశాలు కాకుండా కొత్తగా ఉండేటటువంటి ప్రదేశాలకు తీసుకువెళ్లి తనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలగజేయాలని నిర్ణయం తీసుకున్నానని అన్నారు. నేను మాత్రం రెండు ప్రదేశాలకు తీసుకొని వెళ్లాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఆ రెండు ఏమిటంటే ఒకటి మంగోలియా, మరోకటి నేపాల్. తన వయసు పెరిగే కొద్ది తన జీవన విధానం మారిపోతుంది కాబట్టి ఈ లోపే నేను నాకు నచ్చిన కొన్ని ప్లేసులను తనకి చూపించాలనేది నా కొరికని ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు.
ఇది ఇలా ఉంటే త్రీ మస్కటర్స్ సినిమాలో 'మిలా జోవోవిచ్ మైలేడీ డీ వింటర్' అనే పాత్రను పోషించారు. త్రీ మస్కటర్స్ అయిన ఫోతోస్, ఆథాస్, అరామిస్ ముగ్గురు కలిసి ఫ్రాన్స్ రాజు ప్రాణాలను కాపడడమే కాకుండా రాజ్యంలో జరిగేటటువంటి కుట్రలు, కుతంత్రాలను చేధించడం జరుగుతుంది. మిలా జోవోవిచ్, ఓర్మాల్డ్ బ్రూమ్ తదితరులు ప్రధాన తారగణంగా హాలీవుడ్‌లో ఇటీవలే త్రీ మస్కటర్స్ అనే సినిమా విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేస్తుంది.


Click it and Unblock the Notifications











