బేబిని దత్తతు తీసుకున్న మనసున్న హీరోయిన్...!

జూలియారాబర్ట్స్ కి ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నాకూడా ఇండియా అమ్మాయిని దత్తతు తీసుకోవడానికి ముందుకు వచ్చింది. ఒకే కాన్పులో ఇద్దురు పిల్లలుకు జన్మనిచ్చినటువంటి జూలియారాబర్ట్స్ ఆ కాన్పు సమయంలో చాలా ఇబ్బందులకు గురిఅయ్యారని, చాలా తీవ్రమైన నొప్పిని భరించారని ఆమె భర్త అన్నారు. కాని జూలియారాబర్ట్స్ కి పిల్లలు అంటే చాలా ప్రాణం. తన ప్యామిలి విస్తరించాలనే తపన కలిగిన జూలియారాబర్ట్స్ ఇలా చేయడం జరిగిందన్నారు. తన సంతానాన్ని వృద్ది చేసుకోవడానికి దత్తతు తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గమని ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరిగిందన్నారు.
ఈ ఐడియా నచ్చినటువంటి జూలియారాబర్ట్స్ ఆమె భర్త డాని ఇద్దరూ ఈట్ ప్రే లవ్ ఇండియాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో పిల్లలను దత్తతు ఇచ్చే ఏజెన్సీ వద్దకు వెళ్శి వారితో మాట్లాడడం జరిగిందన్నారు. దీనిపై ఇప్పటికే తన పిల్లలతో మన ఇంట్లోకి మరో బేబి రాబోతుందని, రాబోయే బేబి వేరే కల్చర్ సంబంధించిన బేబి అని తన పిల్లలకు ఆ బేబితో ఎలా ఉండాలో వివరించామని ఆ జంట తెలిపారు.


Click it and Unblock the Notifications











