అనుకాని చోట అధికులమన రాదు-జూలియా
హాలీవుడ్ లో ఇటీవలే 'ద ప్రపోజల్స్" చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో ఒకప్పటి హాట్ నటి జూలియా రాబర్ట్స్ ను తీసుకుందామని ముందుగా చిత్ర నిర్మాతలు అనుకున్నారు. కథ విన్న జూలియా కూడా దీనికి పచ్చ జెండా ఊపిందట. కానీ పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేయడంతో 'నీకో నమస్కారం తల్లీ" అనుకుంటూ వెళ్లిపోయారట సదురు నిర్మాత. దీంతో ఈ పాత్ర కాస్త సాండ్రా బుల్లక్ ఒడిలోకి వచ్చిపడింది. ఈ చిత్రంలో కొన్ని రొమాంటిక్ కామెడీలు భలేగా చేసిందట సాండ్రా.
దీని పై హాలీవుడ్ వర్గాలు స్పందిస్తూ, "అమ్మా! జూలియా నీ రేటును ఒకసారి పరీశీలించుకో. కావలసిన సమయం ఆసన్నమయ్యింది. అందులోనూ నీ వయసు కూడా మీదపడింది. ఇప్పుడు నీవెమంత హాట్ బేబీవి కాదు. ఇలానే రేటు పెంచుకుంటూ పోతే వచ్చే అవకాశాల్ని ఇలా ఎవరో ఒకరు తన్నుకుపోతారు. ఇక నీవు సూపర్ మార్కెట్లు తెరచుకోవాల్సిందే" అంటూ భయపెడుతున్నారు. 'అంత డిమాండ్ మంచిది కాదమ్మా" అని ఓ ఉచిత సలహా పారేస్తున్నారు. సో! సీను రివర్స్ కావడంతో ఆలోచనలో పడింది జూలియా!!


Click it and Unblock the Notifications











