ఆమె కావాలనే 'చీర'ను జారవిడిచిందా...?
జూలియా రాబర్స్ ఒకప్పుడు ఈ పేరు వినగానే యావత్ యుత్ మొత్తం ఆమెకు నీరాజనాలు పట్టింది. ఆమె నవ్వితే అచ్చం మోనాలిసా లాగే ఉంటుందన్నారు. ఎన్నో అకాడమి అవార్డులను సోంతం చేసుకుంది. ఒకప్పుడు జూలియా రాబర్స్ లేకపోతే హాలీవుడ్ లో సినిమానే లేదు అన్నారు. 2002-2006 సంవత్సరంలో ప్రపంచంలో కెల్లా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకోనే హీరోయిన్ గా వార్తల్లోకి ఎక్కారు. ప్రముఖ 'వోగ్' దినపత్రకకు పోజులిచ్చిన మొట్టమొదటి హిరోయిన్ జూలియా రాబర్స్.
ఇటీవల కాలంలో జూలియా రాబర్స్ నటించిన చిత్రం 'ఈట్ ప్రే లవ్'ఈ చిత్రంలో ఆమె నటించిన తీరు అందరికి 'వావ్' అనిపించింది. ఈ చిత్రంలో జూలియా రాబర్స్ తో పాటు మన ఇండియా అమ్మాయి కూడా నటించింది. ఈ సినిమా 'పుస్కార్ట్ ప్రైజ్ విన్నర్ 'ఎలిజిబెత్ గిల్ బర్ట్ రచించిన పుస్తకం ఆధారంగా దర్శకుడు రేయన్ ముర్పే ఈ చిత్రన్ని తీశారు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే మనశ్శాంతిని వెతుక్కుంటూ ఒక ట్రావెలర్ ఇటలీ, ఇండియా, ఇండోనేషియాలో ప్రయాణం చేస్తుంటాడు.
ఈ సినిమాలో జూలియా రాబర్స్ ఒక పెళ్లి సీనులో నటించాల్సి వస్తుంది. ఈ సీనులో తనని అచ్చం ఇండియన్ పెళ్లి కూతురు లాగా ముస్తాబు చేసానని, ఈ సినిమాలో నటించిన 'రిషిత' అనే ఇండియా అమ్మాయి చెప్పింది. ఈ సీనులో తను కావాలనే తన ఆరు అడుగుల పొడవు ఉన్న చీరను, అలాగే బింది మరియు పాయల్ ను జారవిడిచింది అని ఈ అమ్మడు చెప్తోంది. అలాగే జూలియా రాబర్స్ తో నటించడం తనకు చాలా ఆనందంగా వుందని, సినిమాని ఇండియాలోకి అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నామని ఇంటర్యూలో తన మనోభావాలను వెల్లడించింది.


Click it and Unblock the Notifications











