హావాయ్ బీచ్ లో బికిని లో దర్శనమిచ్చిన అందాల భామ...!
జూలియా రాబర్స్ హాలీవుడ్ అందగత్తేల్లో ఒకరు. ఇటీవల కాలంలో జూలియా రాబర్స్ నటించిన చిత్రం 'ఈట్ ప్రే లవ్'. ఈ చిత్రంలో ఆమె నటించిన తీరు అందరికి 'వావ్' అనిపించింది. ఈ సినిమా 'పుస్కార్ట్ ప్రైజ్ విన్నర్ 'ఎలిజిబెత్ గిల్ బర్ట్ రచించిన పుస్తకం ఆధారంగా దర్శకుడు రేయన్ ముర్పే ఈ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం హాలీవుడ్ లో బాక్సా ఫీస్ రికార్డులు బద్దలు కోడుతుంది. ఈ ఆనందంలో ఏమి చేయాలో తెలియక ఈ అమ్మడు కుటుంబంతో సహా హావాయి బీచ్ లో బికిని తో ప్రేక్షకులకు మతి పోగోడుతుంది ఈ ప్రిట్టి ఉమెన్. హావాయ్ లో జూలియా రాబర్స్ తో పాటు తన భర్త డానీ మోడర్ మరియు 5 సంవత్సరాల వయసుగల కవల పిల్లలు హాజల్, ఫిన్ తోపాటు కోడుకు హెన్రీ కూడా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
జూలియా రాబర్స్ 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో అలాగే తన ఫిగర్ని 42 సంవత్సరాలలో కూడా అలాగే కాపాడుకుంటున్నారంటే అది చాలా గోప్పవిషయం. అంతే కాకుండా జూలియా రాబర్స్ ముగ్గురు పిల్లల తల్లి కూడా, ఎటువంటి కాస్మోటిక్ సర్జరిలు కూడా చేయించుకోకుండా నలభై లో కూడా పిటపిటలాడే సౌందర్య రాశిలా ఉందంటే అది మామూలు విషయం కాదంటున్నారు నిపుణులు. అందుకేనేమో జూలియా రాబర్స్ అంటే అంత పిచ్చి కోంత మంది అభిమానులకి. ఇలా ఒకసారి తన అందానికి రహాస్యం ఏంటీ అనిఅడగగా ఆమె నవ్వుతూ 'నవ్వే' నా అందానికి రహాస్యం అన్నారంట. మరేమి లేదండీ ఎప్పుడూ ఆనందంగా ఉండమని చెబుతోంది.


Click it and Unblock the Notifications











