'నార్మల్ హార్ట్' కోసం మళ్లీ జత కట్టనున్న హిట్ పెయిర్
హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ జూలియా రాబర్ట్స్ కొత్త చిత్రానికి అంగీకారం తెలిపారు. ఈ సినిమా పేరు 'ద నార్మల్ హార్ట్'. ఈ సినిమాలో హీరో పాత్రకిరేయన్ ముర్పే నటిస్తుండగా, లీడ్ హీరోయిన్ పాత్రలో జూలియా రాబర్ట్స్ నటించేందుకు అంగీకరించారు. ఈ సినిమా 1980లో న్యూయార్క్ నగరంలో HIV / AIDS సంక్షోభం ఎలా పెరిగిందనే కధతో దీనిని రూపొందించనున్నారు. జూలియా రాబర్ట్స్‌తో పాటు, ఈ సినిమాలో అలెక్ బాల్డ్విన్, మాట్ బోమర్, జిమ్ పార్సన్స్ తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో జూలియా రాబర్ట్స్ వీల్ ఛైర్‌లో ఉండే డాక్టర్ ఎమ్మా బ్రూక్నెర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు లారీ క్రామెర్ కధను అందించారు. నెడ్ వీక్స్ అనే పాత్రకు గాను 'మార్క్ రఫ్పె లో' గతంలోనే నటించేందుకు సంతకం చేశారు. తోబుట్టువు సెక్సువాలిటీకి సంబంధించిన కేసుని వాదించే లాయర్‌గా అలెక్ బాల్డ్విన్ నటిస్తున్నారు.
గతంలో జూలియా రాబర్ట్స్, రేయన్ ముర్పే కలసి 'ఈట్ ప్లే లవ్' అనే సినిమాకి కలసి పని చేసారు. మళ్లీ ఈ జంట 'ద నార్మల్ హార్ట్' తో జత కట్టనున్నారు. ఇక జూలియా రాబర్స్ ఒకప్పుడు ఈ పేరు వినగానే యూత్ మొత్తం ఆమెకు నీరాజనాలు పట్టారు. ఆమె నవ్వితే అచ్చం మోనాలిసా లాగే ఉంటుందన్నారు. అలాంటి అందగత్తె జూలియా రాబర్ట్స్ ఎన్నో అకాడమి అవార్డులను సోంతం చేసుకుంది. ఒకప్పుడు జూలియా రాబర్స్ లేకపోతే హాలీవుడ్ లో సినిమానే లేదు అన్నారు. 2002-2006 సంవత్సరంలో ప్రపంచంలో కెల్లా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకోనే హీరోయిన్ గా వార్తల్లోకి ఎక్కారు. ప్రముఖ 'వోగ్' దినపత్రకకు పోజులిచ్చిన మొట్టమొదటి హీరోయిన్ జూలియా రాబర్స్.


Click it and Unblock the Notifications











