సినిమాలు లేకనే ఫియానో క్లాసులు: స్టార్ హీరోయిన్
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జూలియా రాబర్ట్స్ ప్రస్తుతం సినిమాలు లేక ఖాలీగా ఉండడం వల్ల ఇంట్లో బిజీగా ఉండడం కోసం కుట్లు, అల్లికలతో పాటు పియానో క్లాసులు నేర్చుకుంటుందని సమాచారం. జూలియా రాబర్ట్స్ ప్రేమించి డానీ మోడర్‌ని పెళ్శి చేసుకోవడం ఆ తర్వాత ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. జూలియా రాబర్ట్స్ మాట్లాడుతూ ఇటీవలే కుట్లు, అల్లికలు క్లాసులు మొదలుపెట్టాను. దీనిని మొదలు పెట్టడానికి కారణం మా పిల్లల తల క్రిందకి దిండులు కుట్టడంతో పాటు, డానీ కోసం సింపుల్‌గా ఉండేటటువంటి ప్యాంట్స్ కుట్టాలనేది నా ఉద్దేశ్యం అని అన్నారు. అంతేకాకుండా మా పిల్లలకు ఫియానో నేర్పించడం కోసం ప్రత్యేకంగా పిల్లలతో కలసి ఫియానో క్లాసులకు కూడా వెళ్లడం జరుగుతుందని తెలిపింది.
ప్రస్తుతం నా వయసు 40 సంవత్సరాలు. ఇటువంటి పరిస్దితులలో కొత్త వాటిని నేర్చుకోవడానికి నా మైండ్ పెద్దగా సహాకరించడం లేదు. అందుకే నేను ఫియానో స్కేల్స్‌ని ప్రాక్టీస్ చేస్తున్నానని అన్నారు. 2002-2006 సంవత్సరంలో ప్రపంచంలో కెల్లా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకోనే హీరోయిన్ గా వార్తల్లోకి ఎక్కారు. ప్రముఖ 'వోగ్' దినపత్రకకు పోజులిచ్చిన మొట్టమొదటి హిరోయిన్ జూలియా రాబర్స్. ఈట్ ప్రే లవ్ అనే సినిమాలో భాగంగా ఇండియాని సందర్శించినటువంటి జూలియారాబర్ట్స్ హిందూమతం తీసుకున్న విషయం మన అందరికి తెలిసిందే.
జూలియారాబర్ట్స్ కి ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నాకూడా ఇండియా అమ్మాయిని దత్తతు తీసుకోవడానికి ముందుకు వచ్చింది. ఒకే కాన్పులో ఇద్దురు పిల్లలుకు జన్మనిచ్చినటువంటి జూలియారాబర్ట్స్ ఆ కాన్పు సమయంలో చాలా ఇబ్బందులకు గురిఅయ్యారని, చాలా తీవ్రమైన నొప్పిని భరించారని ఆమె భర్త అన్నారు. కాని జూలియారాబర్ట్స్ కి పిల్లలు అంటే చాలా ప్రాణం. తన ప్యామిలి విస్తరించాలనే తపన కలిగిన జూలియారాబర్ట్స్ ఇలా చేయడం జరిగిందన్నారు. తన సంతానాన్ని వృద్ది చేసుకోవడానికి దత్తతు తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గమని ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరిగిందన్నారు.


Click it and Unblock the Notifications











