కారు ప్రమాదంలో గురైన కమెడియన్‌.. తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో..

హాలీవుడ్ నటుడు, కమెడియన్ కెవిన్ హార్ట్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. లాస్ ఎంజెలెస్‌కు సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో కెవిన్ గాయపడటంతో హాలీవుడ్ నటులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో కెవిన్‌తోపాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా గాయపడటం గమనార్హం. తీవ్రంగా గాయపడిన కెవిన్ వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

కాలిఫోర్నియా పోలీసుల ప్రకారం..

కాలిఫోర్నియా పోలీసుల ప్రకారం..

కాలిఫోర్నియా హైవే పెట్రోల్ పోలీసుల తెలిపిన ప్రకారం.. లాజ్ ఎంజెలెస్‌లోని ముల్హోల్లాండ్ హైవేలో ఆదివారం తెల్లవారు జామున కారు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో అత్యాధునిక సాంకేతికతో రూపొందిన ప్లైమౌత్ బార్రాకుడా వింటేజ్ కారులో ఆయన ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆయనకు వెన్నుముకకు బలమైన గాయమైనట్టు ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైంది.

మితిమీరిన వేగం.. అదుపు తప్పడంతో

మితిమీరిన వేగం.. అదుపు తప్పడంతో

కారు ప్రమాదం జరిగినప్పుడు డ్రైవింగ్ సీట్లో తన డ్రైవర్ జారెడ్ బ్లాక్ ఉన్నారని, మితిమీరిన వేగంతో వెళ్తున్న సమయంలో అదుపుతప్పడంతో కారు ప్రమాదానికి గురైందని కాలిఫోర్నియా పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో వారిలో ఫిట్‌నెస్ మోడల్ రెబెకా బ్రాక్స్‌టర్ ఉన్నట్టు గుర్తించాం అని పేర్కొన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే

ప్రమాదం జరిగిన వెంటనే

లాస్ ఎంజెలెస్ కారు సంఘటనలో గాయపడిన కెవిన్ హార్ట్, బ్లాక్, రెబెకా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం భారీగా జరగడంతో ఆ ముగ్గురు షాక్‌లోనే ఉన్నారు. వారిని వెంటనే సమీపం ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. వారి ఆరోగ్యానికి సంబంధించిన బులెటిన్ ఇంకా వైద్యులు విడుదల చేయలేదు అని మరో హాలీవుడ్ పత్రిక పేర్కొన్నది.

వివాదంతో ఆస్కార్‌కు దూరం

వివాదంతో ఆస్కార్‌కు దూరం

హాలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్‌గా కెవిన్ హార్ట్ మంచి గుర్తింపు ఉంది. ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్ అండ్ జుమాంజి చిత్రాల్లో ఆయన నటనకు మంచి ప్రేక్షకాదరణ లభించిన విషయం తెలిసిందే. 2019 ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి ఆయన హోస్ట్‌గా వ్యవహరించాల్సింది. హోమో సెక్సువాలిటీ అంశంలో ఓ వివాదాస్పద ట్వీట్‌ కారణంగా హోస్ట్‌గా తప్పుకోవాల్సి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X