జుమాంజి: ద నెక్ట్స్ లెవెల్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది
హాలీవుడ్ సినిమాలు ఇష్టపడే వారికి డ్వేన్ జాన్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసిన సినిమాలు పూర్తి యాక్షన్ జోనర్‌లో ఉంటాయి. అందుకే ఆ సినిమాలన్నీ భారీ విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఇక, 2017లో డ్వేన్ జాన్సన్ నటించిన 'జుమాంజి' ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. అందుకే దీనికి కొనసాగింపుగా సినిమాలు వస్తున్నాయి.
1995లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జుమాంజి' థీమ్‌తోనే ఈ సినిమాను తెరకెక్కించారు. డ్వేన్ జాన్సన్, జేక్ బ్లాక్, కెవిన్ హర్ట్, కరెన్ గిల్లాన్, నిక్ జోన్స్, బాబీ కాన్నవాలీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జేక్ కాస్డన్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, అన్ని దేశాల్లోనూ మంచి కలెక్షన్లు సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 960 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.

ఇది ఘన విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ తీయాలని భావించింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే సరికొత్త టెక్నాలజీతో మరోసారి సందడి చేయబోతుంది జుమాంజి. ఈ సారి దీనికి 'జుమాంజి: ద నెక్ట్స్ లెవెల్' అనే టైటిల్ పెట్టారు. ఇందులో కూడా డ్వేన్ జాన్సన్, జాక్ బ్లాక్, కెవిన్ హార్ట్ తదితరులు కీలకపాత్రల్లో కనిపిస్తారు. మరోసారి జుమాంజికి సంబంధించిన హార్డ్ డిస్క్‌ను టచ్ చేయడం.. ఆ తర్వాత ఆ ప్రపంచంలోకి వెళ్లిపోవడంతో సినిమా ప్రారంభం అవుతుంది.
ఈ సిరీస్‌లో వచ్చిన గత చిత్రాల కంటే కొత్తగా పూర్తి యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమా రూపొందింది. ఇది ఇంగ్లీష్‌తో పాటు భారతదేశంలోని చాలా భాషల్లో విడుదల కాబోతుంది. ఇందులో భాగంగానే తెలుగు ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీన్ని సోనీ సంస్థ విడుదల చేయబోతుంది. డిసెంబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











