Don't Miss!
- News ఆంధ్రాలో అంతు చిక్కని ఓటరు నాడి, కాళ్లు పట్టుకున్న లీడర్స్, కాలవర్ ఎగరేస్తున్న ఓటర్, ఇది లెక్క !
- Finance Gold Rate: దెబ్బకు కిందబడ్డ బంగారం ధర.. వెంటనే షాపింగ్ మెుదలెట్టండి..!!
- Automobiles బైకును ఇలా కూడా డెలివరీ చేస్తారని మీకు తెలుసా? వీడియో చూస్తే ఫిదా అవుతారు!
- Sports ఈ దరిద్రపు బౌలింగ్‌తో కప్ కొట్టేద్దామనే: ఆశకు హద్దు ఉండాలమ్మా
- Technology పార్ట్‌టైం ఉద్యోగం పేరిట మీకూ ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.. ఇటీవల ఏం జరిగిందో తెలుసా..?
- Lifestyle April Bank Holidays : ఏప్రిల్‌లో 14 రోజులు సెలవు, ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ఎందుకంటే?
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
జూరాసిక్ వరల్డ్ మూవీ... టెక్నాలజీ రహస్యం ఇదే (వీడియో)
హైదరాబాద్: ఇటీవల విడుదలైన ‘జూరాసిక్ వరల్డ్' సినిమా చూసిన వారు అందులో పెద్ద పెద్ద డైనోసార్లను చూసి ఆశ్చర్య పడే ఉంటారు. అసలు భూమిపై ఇపుడు మనుగడలో లేని జంతువులను ఉన్నది ఉన్నట్లుగా రియలిస్టిగ్ గా చూపించడం అద్భుతం. ఓ సీన్లో రాకాసి డైనోసార్ దాడిలో తీవ్రంగా గాయపడి కొనవూపిరితో ఉన్న సాధారణ డైనోసార్‌ను హీరో ఓదార్చే సన్నివేశం అయితే సూపర్బ్. ఇంతకీ అ సీన్ ఎలా తీసారు? దాని వెనక రహస్యం ఏమిటి అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
జూరాసిక్ వరల్డ్ మూవీ అందరూ ఊహించినట్లుగానే వసూళ్ల విషయంలో రికార్డులు తిరగరాసింది. జూన్ 11న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి వీకెండ్ బాక్సాఫీసు బద్దలయ్యే కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 511 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మన కరెన్సీలో ఈ లెక్క రూ. 3 వేల కోట్ల పైమాటే.
ఒళ్లు గగుర్బొడిచే సాహసాలు, డైనో సార్స్ గురించి సాగే మూవీ ‘జురాసిక్ పార్క్'. తొలిసారి 1993లో స్పీల్ బర్గ్ దర్శకత్వంలో వచ్చిన 'జురాసిక్ పార్క్...' వెండితెర ప్రపంచంలో ఓ సంచలనం. అప్పట్లో ఆ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇప్పటికే ఈ సీరీస్ లో 3 సినిమాలు వచ్చి భారీ విజయం సాధించాయి. తాజాగా 4వ ఎడిషన్ ‘జురాసిక్ వరల్డ్' కూడా బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటింది.
ఈ చిత్రానికి కోలిన్ ట్రేవోరోవ్ దర్శకత్వం వహించారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, ఫ్రాంక్ మార్షల్, పాట్రిక్ క్రోవ్లీ, థామస్ తుల్ సంయుక్తంగా నిర్మించారు. క్రిస్ ప్రాట్ ప్రధాన పాత్ర పోషించగా, బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించాడు.