twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రివ్యూలు చూసి షాకైన ఫ్యాన్స్: 2 స్టార్లకు మించి రేటింగ్ రాలేదు....

    By Bojja Kumar
    |

    ప్రపంచ సినీ చరిత్రలో ఓ సంచలనం జూరాసిక్ పార్క్. లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్స్ (రాకాసి బల్లులు)కు జీవం పోసి తెరపై చూపించడం సినీ అభిమానులను ఎంతగానో అబ్బురపరిచాయి. ఇప్పటి వరకు నాలుగు సిరీస్‌ మూవీస్ రాగా .... తాజాగా 5వ సరిస్ 'జూరాసిక్ వరల్డ్-ఫాలెన్‌ కింగ్‌డమ్' పేరుతో జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.

     అభిమానులకు షాకిచ్చిన రివ్యూలు

    అభిమానులకు షాకిచ్చిన రివ్యూలు

    ‘జూరాసిక్ వరల్డ్-ఫాలెన్‌ కింగ్‌డమ్' సినిమాకు సంబంధించి హాలీవుడ్ మీడియాలో ఇప్పటికే రివ్యూలు వచ్చేశాయి. ప్రపంచ ప్రఖ్యాత సినీ క్రిటిక్స్ ఈ సినిమా ఎలా ఉంది అనేది తమ రివ్యూల్లో చెప్పుకొచ్చారు. అయితే చాలా మంది క్రిటిక్స్ తమ రివ్యూల్లో సినిమా అంతగొప్పగా ఏమీ లేదని విమర్శించారు.

    క్రిటిక్స్‌ను ఆకట్టుకోని వైనం

    క్రిటిక్స్‌ను ఆకట్టుకోని వైనం

    ‘జూరాసిక్ వరల్డ్-ఫాలెన్ కింగ్‌డమ్' చిత్రం హాలీవుడ్ సినీ విమర్శకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయిందని, సినీ క్రిటిక్స్ నుండి కేవలం 63 శాతం మార్కులు మాత్రమే పడ్డాయని ప్రముఖ హాలీవుడ్ సినీ రివ్యూ అగ్రిగేటర్ వెబ్‌సైట్ రొట్టెన్ టమాటోస్ పేర్కొంది. అయితే సినిమా ఫ్రెష్‌గా ఉందనే కాంప్లిమెంట్ రావడం విశేషం.

    తక్కువ రేటింగ్ ఇచ్చిన గార్డియన్

    తక్కువ రేటింగ్ ఇచ్చిన గార్డియన్

    ప్రముఖ వెబ్‌సైట్ ‘ది గార్డియన్'లో ఈ సినిమాకు రివ్యూ రాసిన పీటర్ బ్రాడ్‌షా కేవలం 2 స్టార్ రేటింగ్ మాత్రమే ఇవ్వడం గమనార్హం. సినిమాలో కొన్ని వినోదాత్మకమైన సన్నివేశాలు, సెట్స్ బాగున్నాయి కానీ.... డైనోసార్స్ విన్యాసాలు అంతగొప్పగా, కాన్సెప్టు ఆకట్టుకోలేదని వెల్లడించారు.

    ది టెలిగ్రాఫ్

    ది టెలిగ్రాఫ్

    ప్రఖ్యాత ‘ది టెలిగ్రాఫ్' వెబ్‌సైట్లో ఈ చిత్రానికి 2 స్టార్ రేటింగ్ మాత్రమే రావడం గమనార్హం. ‘ఈ సినిమా చాలా బోరింగ్‌గా ఉంది' అని క్రిటిక్ రోబీ కోలిన్ వెల్లడించారు.

     లాస్‌ఏంజెలెస్ టైమ్స్

    లాస్‌ఏంజెలెస్ టైమ్స్

    లాస్‌ఏంజెలెస్ టైమ్స్‌లో రివ్యూ రాసిన జస్టిన్ చాంగ్.... ‘సినిమా సాగుతూనే ఉంది, కానీ మూవీలో ఏదో కొత్తగా ఉంటుందని భావించాము. అలాంటిదేమీ కనిపించలేదు లేదు' అని వెల్లడించారు.

    కొన్ని రివ్యూలు మాత్రం పాజిటివ్‌గా

    కొన్ని రివ్యూలు మాత్రం పాజిటివ్‌గా

    అయితే కొన్ని రివ్యూలు మాత్రం పాజిటివ్‌గా ఉన్నాయి. ‘ఎంపైర్' వెబ్ సైట్‌కు రివ్యూ రాసిన బెన్ ట్రావిస్ ఈ చిత్రానికి 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. సినిమా ఆసక్తికరంగా ఉందని వెల్లడించారు. ‘ది ఇండిపెండెంట్' వెబ్‌సైట్ కూడా 4 స్టార్స్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం.

    జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డమ్

    జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డమ్

    జురాసిక్ వల్డ్: ఫాలెన్ కింగ్‌డమ్ చిత్రానికి జె.ఏ. బయోనా దర్శకత్వం వహించారు. క్రిష్ ప్రాట్, బ్రీస్ డల్లాస్ హోవర్డ్, రాఫె స్పాల్, జస్టిన్ స్మిత్, డానియల్లా పినెదా, జేమ్స్ క్రోమ్‌వెల్, టోబీ జోన్స్, టెడ్ లెవైన్, బి.డి.వాంగ్ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 7న ఈ చిత్రం ఇండియా తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళ భాషల్లో విడుదలవ్వబోతోంది.

    English summary
    Jurassic World: Fallen Kingdom releases this weekend. While fans cannot wait to experience the chaos caused by the dinosaurs on the silver screen, movie-goers shouldn't pin their expectations too high because the reviews aren't that great. The film continues from Colin Trevorrow's rebooted Jurassic Park trilogy where Owen (Chris Pratt) and Claire (Bryce Dallas Howard) return to the dinosaur land Islar Nublar and save the creatures from an actively erupting volcano.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X