Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డైనోసారస్ ప్రపంచంలోకి స్వాగతం: ‘జురాసిక్ వరల్డ్’
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ సినిమాలైన ‘జురాసిక్ పార్క్' సిరీస్ చిత్రాల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఇప్పటికే మూడు సిరీస్ సినిమాలు వచ్చాయి. తాజాగా నాలుగో సిరీస్ రాబోతోంది. ‘జురాసిక్ వరల్డ్' పేరుతో రాబోతున్న ఈచిత్రం వచ్చే ఏడాది జూన్ 12వ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజాగా ‘జురాసిక్ వరల్డ్' టీజర్ విడుదలైంది. ఈ నెల 27న ఈ చిత్రానికి సంబంధించిన అపీషియల్ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కోలిన్ ట్రేవోరోవ్ దర్శకత్వం వహించనున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, ఫ్రాంక్ మార్షల్, పాట్రిక్ క్రోవ్లీ, థామస్ తుల్ సంయుక్తంగా నిర్మించనున్నారు.
ఈ చిత్రంలో క్రిస్ ప్రాట్, బ్రేస్ డల్లాస్ హోవర్డ్, విన్సెంట్, జేక్ జాన్సన్, నిక్ రాబిసన్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. గత సిరీస్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. జూన్ 12, 2015న ఈ చిత్రాన్ని యూనివర్సల్ పిక్చర్స్ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది. ఈ నెల 27న విడుదలయ్యే ‘జూరాసిక్ వరల్డ్' అపీషియల్ టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.