twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడే తేడా గాడివి, అమ్మాయిలా ఉన్నావ్ అన్నారు.. సూసైడ్ వరకు వెళ్ళాను: స్టార్ సింగర్

    |

    రంగుల ప్రపంచంలో కష్టపడిన ప్రతి ఒక్కరికి సక్సెస్ రాకపోవచ్చు. ఇక సక్సెస్ అనంతరం ఇబ్బందులు రాకుండా ఉంటాయనే గ్యారెంటీ లేదు. సెలబ్రెటీ హోదాను చాలా సెన్సిటివ్ గా డీల్ చేయకపోతే మొదటికే మోసం వస్తుందని అందరికి తెలిసిందే. అయితే వ్యక్తి గత జీవితంలో పాజిటివ్ గా చేసిన పనుల వల్ల కూడా విమర్శలు వస్తూనే ఉంటాయి. అదే తరహాలో ప్రపంచం మెచ్చిన సింగర్ జస్టిన్ బీబర్ కూడా ఎన్నోసార్లు హేళనకు గురయ్యారు. గే, తేడా గాడుజ్ అమ్మాయిలాక్ ఉన్నావ్ అంటూ అవమానపరిచారు.

    పసి వయసులోనే ప్రపంచాన్ని ఆకర్షించి..

    పసి వయసులోనే ప్రపంచాన్ని ఆకర్షించి..

    టీనేజ్ వయసులోనే ఓ బేబి..బేబి అనే పాటతో ప్రపంచాన్ని ఆకర్షించిన ఈ కెనడియన్ సింగర్ అతి తక్కువ సమయంలో వరల్డ్ టాప్ సెలబ్రెటీగా క్రేజ్ అందుకున్నాడు. జస్టిన్ బీబర్ నుంచి ఒక ఆల్బమ్ వస్తోంది అంటే ఎగబడి కొనే జనాలు వందల కోట్లల్లో ఉన్నారు. నిమిషాల్లోనే ఈ టాలెంటేడ్ సింగర్ పాడిన పాటలు మిలియన్ వ్యూవ్స్ అందుకుంటాయి.

    సూసైడ్ చేసుకోవాలని అనుకున్నా..

    సూసైడ్ చేసుకోవాలని అనుకున్నా..

    సారి, యామ్మి యామ్మి.. వంటి పాటలతో కూడా వండర్స్ క్రియేట్ చేసిన ఈ యువ సింగర్ కొన్ని సందర్భాల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలు అప్పట్లో అభిమానులను ఎంతగానో కలవరపరిచాయి. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిన్ కొన్ని ఎమోషనల్ విషయాలను బయటపెట్టాడు. ముఖ్యంగా 15ఏళ్ళ వయసులో సక్సెల్ లో ఉన్నప్పుడు కూడా తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని చెప్పాడు.

    ఈ బాధలు ఇంక ఎన్ని రోజులు

    ఈ బాధలు ఇంక ఎన్ని రోజులు

    యూ ట్యూబ్ జస్టిన్ బీబర్ నెక్స్ట్ చాప్టర్ లో భాగంగా జస్టిన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితం గురించి కొన్ని విషయాలని బయటపెట్టాడు. అతను మాట్లాడుతూ.. నిజంగా సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను. అలాంటి సందర్భాలు ఉన్నో ఉన్నాయి. ఈ బాధలు ఇంక ఎన్ని రోజులు.. జీవితంలో నుంచి అసలు పోతాయా అనేకునే వాడినని అన్నాడు.

    అశ్లీల వీడియోలు క్రియేట్ చేసి..

    అశ్లీల వీడియోలు క్రియేట్ చేసి..

    కొన్నేళ్ల క్రితం ఈ సింగర్ కి సంబంధించిన ఫేక్ అశ్లీల వీడియోను క్రియేట్ చేసి ఇంటర్నెట్ లో వైరల్ చేసిన విధానం అప్పట్లో సంచలనం సృష్టించింది. అతన్ని తేడా అంటూనే.. అమ్మాయిలా ఉన్నాడనే ఎగతాళి చేశారు. ఆ పరిస్థితులలో ఎలా బాధ నుంచి బయటపడాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట.

    అప్పటి నుంచి పట్టించుకోవడం లేదు

    అప్పటి నుంచి పట్టించుకోవడం లేదు

    ఇక 15ఏళ్ళ వయసులో చుట్టూ లక్షలమంది తన కోసం రావడం ఆనందంగా ఉండేది కానీ.. మొదట్లో కాస్త కంగారు పడినట్లు చెప్పాడు. ఇక తన పాటలపై కొందరి నుంచి విమర్శలు రావడమే కాకుండా నా పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేసి విమర్శించేవారని కూడా జస్టిన్ తెలిపారు. అయితే కొన్నాళ్లకు జీవితం అంటే ఎమోటో అర్థమయ్యిందని ఆ తరువాత ఎవరు అన్ని మాటలు అన్నా కూడా పట్టించుకోలేదని చెప్పాడు.

    English summary
    It is a well known fact that if celebrity status is not dealt with very sensitively then cheating will come first. But criticism also keeps coming because of what the person has done positively in the past life. The world-famous singer Justin Bieber has been ridiculed many times in the same way. the difference is that Godz insulted the girl.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X