ఫోటోగ్రాఫర్‌తో తగాదా పెట్టుకున్న టీనేజ్ సింగర్ జస్టిన్ బైబర్
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ టీనేజ్ సింగింగ్ సెన్షేషన్ జస్టిన్ బైబర్ ఇబ్బందుల్లో పడ్డాడు. యూత్‌లో బాగా పాపులారిటీని సంపాదించుకున్న జస్టిన్ బైబర్ ఓ ఫోటోగ్రాఫర్‌తో ప్రవర్తించిన తీరు ఇప్పుడు ఇబ్బందుల్లో పడేసింది. వివరాల్లోకి వెళితే జస్టిన్ బైబర్ తన ప్రియురాలైన సెలీనా గోమెజ్ ఇద్దరూ కలిసి కామన్స్ లో ఉన్న కాలబాసాస్ షాపింగ్ సెంటర్‌కు రావడంతో వీరిని చూసిన ఓ ఫోటోగ్రాఫర్ తన వద్దనున్న కెమెరాతో ఫోటోలు తీసే ప్రయత్నం చేశాడు. దీంతో జస్టిన్ బైబర్ కోపోద్రేక్తుడై అతనిని తిట్టడంతో పాటు అతనిపై చేయి కూడా చేసుకున్నాడని నివేదికల ద్వారా తెలిసింది.
జస్టిన్ బైబర్ చేతిలో దెబ్బలు తిన్న ఫోటోగ్రాఫర్ ఆ తర్వాత 911ఫోన్ చేసి ఎగువ మొండెంపై దెబ్బలు తగినట్లుగా కంప్లైంట్ చేశాడు. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్‌లో చేర్పించగా.. కొన్ని గంటల తర్వాత అతనిని ఆస్పత్రి నుండి విడుదల చేశారు. అదే సమయంలో ఉన్నతాధికారులు వచ్చే సరికే అక్కడ నుండి జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ ఇద్దరూ జారుకున్నారు.
దీంతో ఆ ఫోటోగ్రాఫర్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతనిపై కేసు నమోదు చేశాడు. ఈ విషయాన్ని లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ యొక్క డిటెక్టివ్ జస్టిన్ బైబర్, నటి సెలెనా గోమెజ్ ఇద్దరిపై ఫోటోగ్రాఫర్ చేసిన ఆరోపణలను పరిశోధించారు. 18 సంవత్సరాల వయసు కలిగిన జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ ఇద్దరూ 2010 నుండి డేటింగ్‌లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











