ఆ ముద్దు సీను వల్ల అతని గర్ల్ ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు..!
పదహారు సంవత్సరాల వయసులోనే యావత్ ప్రపంచాన్ని తన మ్యూజిక్ తో పరవశం చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు మన జస్టిన్ బైబర్. ఇటీవల జరిగిన యమ్ టివి వీడియో మ్యూజిక్ అవార్డులలో బెస్ట్ న్యూ కమర్ అవార్డు తీసుకున్న ఈ బుడతడు అతి తక్కువ సమయంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న తర్వాత ఆటోమాటిక్ గా వివాదాలు కూడా వాటంతట అవే మన దగ్గరకు వస్తాయి. తన కోస్టార్ అయినటువంటి జాస్మిన్ విల్లిగాస్ ను తన హీరోహుండా బ్యాక్ సీట్ లో లిపిటులిప్ ముద్దు పెట్టుకున్న వీడియో క్లిప్పింగ్ బయటకు రావడంతో జస్టిన్ బైబర్ కున్న గర్ల ఫ్యాన్న్ బాధపడ్డారని సమాచారం.
విల్లిగాస్ వయసు కూడా 16సంవత్సరాలు. విల్లిగాస్ మరియు జస్టిన్ బైబర్ ఇద్దరూ బేబి అనే మ్యూజిక్ వీడియోల్ కలసి నటించడం జరిగింది. అంతేకాకుండా ఈ అమ్మడు ప్రస్తుతం జస్టిన్ బైబర్ చేపట్టినటువంటి కొత్త టూర్లో కూడా ఉంది. అంతేకాకుండా జస్టిన్ బైబర్ మరియు విల్లిగాస్ ఇద్దరూ చాలా కాలం నుండి డేటింగ్ లో పోల్గోన్నట్లు సమాచారం. జస్టిన్ బైబర్ ముద్దుపెట్టుకున్న సమయంలో అక్కడున్న వారు చాలా మంది చూడడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్లు వివరించారు. ఇంకోక త్వరలోనే వారిద్దరూ పెళ్శి కూడా చేసుకోబోతున్నారనే రూమర్ కూడా ఉంది.


Click it and Unblock the Notifications











