ఆమె నా భార్య అంటూ... పెళ్లి విషయాన్ని అఫీషియల్‌గా వెల్లడించాడు!

అమెరికన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్, మోడల్ మెయిలీ బాల్డ్విన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు కొంతకాలం క్రితం వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ఖరారు చేస్తూ జస్టిన్ బీబర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఫోటో పోస్ట్ చేశాడు.

హెయిలీతో చేతిలో చేయేసి నడుస్తున్న ఫోటోను అభిమానులతో పంచుకున్న బీబర్ 'నా భార్య ఎంతో అందంగా ఉంది' అంటూ పేర్కొన్నాడు. ఈ ఫోటో కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయింది. ఇప్పటి వరకు దీనికి 64 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి.

View this post on Instagram

My wife is awesome

A post shared by Justin Bieber (@justinbieber) on

న్యూయార్క్‌లో నెల రోజుల క్రితం వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ రాష్ట్రంలో పెళ్లి చేసుకోవాలంటే ముందుగా లైసెన్స్ తీసుకోవాలి. 60 రోజుల వరకు అది చెల్లుబాటు అవుతుంది. వీరు లైసెన్స్ తీసుకోవడానికి న్యూయార్క్‌లోని మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీసుకు వచ్చినపుడే వీరి పెళ్లి గురించిన వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

Justin Bieber

జులైలో బీబర్, హెయిలీ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా జరిగింది. పెళ్లి వేడుక గ్రాండ్‌ జరుగుతుందని అంతా భావించారు. అయితే అలాంటిదేమీ లేకుండా సింపుల్‌గా వీరి పెళ్లి తంతు పూర్తయినట్లు స్పష్టమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X