నా అభిమానులే నాకు శ్రీరామరక్ష అంటున్న పాప్ యువ తరంగం..
పదహారు సంవత్సరాల వయసులోనే యావత్ ప్రపంచాన్ని తన మ్యూజిక్ తో పరవశం చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు మన జస్టిన్ బైబర్. ఇటీవల జరిగిన యమ్ టివి వీడియో మ్యూజిక్ అవార్డులలో బెస్ట్ న్యూ కమర్ అవార్డు తీసుకున్న ఈ బుడతడు అతి తక్కువ సమయంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.
ఇటీవల జర్మనీ లోషో నిర్వహీంచడానికి వెళ్శినటువంటి జస్టిన్ బైబర్ కుతన అభిమానుల నుండి ఓవింత అనుభవం ఎదురైందని అన్నారు. ఓపత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్యూలో జస్టిన్ బైబర్ మాట్లాడుతూ నాకు తెలిసి నాకు అబ్బాయిలు కంటే అమ్మాయిలు ప్యాన్సే ఎక్కువని మొన్నజరిగినటువంటి జర్మనీ ఫంక్షన్ లోతెలుసుకున్నాను. దానికి కారణం నాషో అయిపోయిన తర్వాత కూడా నలుగురు అమ్మాయిలు నన్ను ఫోలో అవుతూ నేను ఉన్న హోటల్ కుచేరుకున్నారు. నన్ను కలసుకోవడానికి వాళ్శు పడినటువంటి తపన చూస్తుంటే నాకు చాలా క్రేజీగా అనిపించిందని అన్నారు.
అందుకే నాకు అభిమానులంటే ఎవలేని ప్రాణం అని అన్నారు. నేనే వెళ్శి వాళ్సను కలసి నాఆటోగ్రాఫ్ ఇచ్చిమరీ పంపించానని అన్నారు. అంతేకాకుండా నాఅభిమానులు నాకోసం ఏమిచేయడానికి కూడా వెనుకాడరని అనుకుంటున్నాను. అందుకే నాఅభిమానులను నేను ముద్దుగా బెలిబర్స్ అని పిలుచుకుంటాను అన్నారు. బెలిబర్స్ అంతే మనకు వారికి ఎలాంటి సంబంధం లేకుపోయినా ఎల్లప్పుడూ మన మంచిని కోరుకునేవారని అర్దం అని అన్నారు.


Click it and Unblock the Notifications











