‘జస్టిన్ బీబర్ పెళ్లి చేసుకొన్నాడు..పెద్దల మాటలు పట్టించుకోలేదు’
యువతను తన పాప్ గీతాలతో ఉర్రూతలూగించిన గాయకుడు జస్టిన్ బీబర్ ఓ ఇంటివాడయ్యాడు. కొద్దికాలంగా డేటింగ్‌లో ఉనన హెయిలీ బాల్డ్‌విన్‌ను న్యూయార్క్ కోర్టు హౌస్‌లో వివాహం చేసుకొన్నాడు. మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి పెళ్లి చేసుకొని వస్తూ మీడియా కంటికి చిక్కారు. అయితే వారు పెళ్లి వార్తను ధృవీకరించడానికి నిరాకరించారు. కానీ హెయిలీ అంకుల్ అలెక్ బాల్డ్‌విన్ రూమర్లకు తెరదించుతూ వారి పెళ్లిని ధృవీకరించారు.
బీబర్, హెయిల్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. కుటుంబ సభ్యుల సూచనను పెద్దగా పట్టించుకోలేదు. వారి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకొన్నారు. వారి వివాహం న్యూయార్క్‌లో సెప్టెంబర్ 13న జరిగింది అని హెయిలీ అంకుల్ పేర్కొన్నారు.

ఈ ఏడాది జూలైలో వారిద్దరికి నిశ్చితార్థం జరిగింది. బెహమాస్‌లో హెయిలీ విహారయాత్ర చేస్తుండగా బీబర్ ఆమెకు లవ్ ప్రపోజ్ చేశారనే విషయం తెలిసిందే. ఆ తర్వాత స్వయంగా బీబర్ తన ప్రేమ గురించి ఇన్స్‌టాగ్రామ్‌లో ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











