పెళ్లి కోసం లైసెన్స్.. త్వరలోనే ప్రియురాలితో పాప్ స్టార్ వివాహం!
స్టార్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఎలాంటి హడావిడి లేకుండా వివాహానికి రెడీ అవుతున్నాడు. తన గాత్రంతో, అదిరిపోయే పెర్ఫామెన్స్ తో సంగీత ప్రియులని ఉర్రూతలూగించే బీబర్ తన ప్రియురాలు హెయిలీ బాల్డ్ విన్ తో చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నాడు.త్వరలోనే ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కాబోతోంది.
ఇటీవల ఈ జంట అందుకు సంబందించిన పనులు ప్రారంభించింది. పెళ్లి చేసుకోవడానికి అవసరమైన లైసెన్స్ ని ఈ జంట ఇటీవల పొందింది. ఏంటని అనుకుంటున్నారా.. యూఎస్ లో పెళ్ళికి రెడీ అవుతున్న జంటలకు అక్కడి ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇస్తూ ఓ ధ్రువపత్రాన్ని అందిస్తుంది.

ఆ లైసెన్స్ ఇటీవల జస్టిన్ బీబర్, హెయిలీ జంట పొందినట్లు తెలుస్తోంది. మ్యారేజ్ లైసెన్స్ గడువు నెలల్లో ముగిసిపోతుంది. అంటే ఆలోపు వీరు పెళ్లి చేసుకోవాలి. జస్టిన్ బీబర్ సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం మరో రెండు వారాల్లోనే వీరిద్దరి వివాహం జరుగబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జస్టిన్ బీబర్ అమెరికా పౌరసత్వం కోసం కూడా ప్రయత్నిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











