ఆ నిశ్చితార్దపు వార్తల్లో నిజం లేదు: మేనేజర్
హాలీవుడ్ టీనేజ్ పాప్ సింగర్ జస్టిన్ బైబర్‌కు తన స్నేహితులురాలు సెలెనా గోమెజ్‌తో నిశ్చితార్థం అయిందంటూ వస్తున్న వార్తలను బైబర్ అధికార ప్రతినిధి కొట్టి పారేశారు. అసలు ఈ వార్త రావడానికి కారణం చికాగో సన్ టైమ్స్ రిపోర్టర్. జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ ఇద్దరూ ఎంగేజ్‌మెంట్ కోసం షాపింగ్ చేస్తున్నారంటూ చికాగో సన్ టైమ్స్ రిపోర్టర్ కథనాన్ని ప్రచురించాడు.
దీనితో పాటు ఓ ప్రముఖ వెబ్ సైట్ వీరిద్దరూ పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యారంటూ ఓ ఆర్టికల్‌ని ప్రచురించింది. ఈ ఆర్టికల్‌లో సూపర్ స్టార్ జంట దగ్గరగా ఉన్న అనేక మంది వ్యక్తులు వారి నిశ్చితార్థం సమీప భవిష్యత్తులో ఉందని అంటున్నారు. అమెరికాలో ఉన్న అతి పెద్ద జ్యూయలరీ షాపులన్నింటిని కలియ తిరగడమే కాకుండా.. పెళ్లికి ఎటువంటి జ్యూయలరీ ఐతే సరిపోతుందో వీరిద్దరే దగ్గరుండి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కోంది.
ఈ విషయాలన్నింటిపై బైబర్ అధికార ప్రతినిధి స్కూటర్ బ్రౌన్ మాట్లాడుతూ ఇంటర్నెట్లో వస్తున్న ఈ పుకార్లు పూర్తిగా అబద్దం. ఈ రూమర్స్ పై బైబర్ టీమ్ మేట్స్ అంతా నవ్వుతున్నారని అన్నారు. ఇది ఇలా ఉంటే జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ ఇద్దరూ 2010 నుండి డేటింగ్‌లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











