twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లికి ముందే ప్రియురాలికి గర్భం.. తండ్రయ్యేందుకు బీబర్ ఉబలాటం!

    |

    పాపులర్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్, అతని ప్రియురాలు మోడల్ హెయిలీ బాల్డ్‌విన్ పెళ్లి గురించి ఇటీవల కాలంలో ఎక్కువగానే వార్తలు వినిపిస్తున్నాయి. మ్యారేజ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఇటీవల ఈ ఇద్దరు కనిపించడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. అయితే వారిద్దరూ పెళ్లికి తొందరపడటం వెనుక ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. హెయిలీ గర్భం దాల్చడం వల్లే వివాహానికి ఏర్పాట్లు చేసుకొన్నాడని కథనలో పేర్కొన్నారు.

    పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

    హెయిలీ ప్రెగ్నెన్సీపై ఊహాగానాలు

    హెయిలీ ప్రెగ్నెన్సీపై ఊహాగానాలు

    జస్టిన్ బీబర్, హెయిలీ గతంలోనే సీక్రెట్ మ్యారేజ్ చేసుకొన్నారు. దానికి చట్టబద్దత కల్పించేందుకు ఇప్పుడు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకు కారణం ఆమె గర్భం దాల్చడమే. తండ్రి కావాలని బీబర్ ఉబలాట పడుతున్నాడు. పిల్లలను కనాలని ఉత్సాహపడుతున్నాడు అని హాలీవుడ్ పత్రిక కథనాన్నివెల్లడించింది.

    హెయిలీ గర్భంపై రూమర్లు

    హెయిలీ గర్భంపై రూమర్లు

    హెయిలీ బెవర్లీ హిల్స్‌లోని ఓ హాస్పిటల్‌ను ఇటీవల పలుమార్లు సందర్శించింది. కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి పరీక్షలు జరిపించింది అని పలు పత్రికలు వెల్లడించాయి. అయితే హెయిలీ కేవలం కంటి పరీక్షలకు కోసం హాస్పిటల్‌కు వెళ్లింది అని ఆమె సంబంధీకులు క్లారిటీ ఇచ్చారు.

    జస్టిన్ బీబర్‌ పెళ్లిపై

    జస్టిన్ బీబర్‌ పెళ్లిపై

    హెయిలీ అంటే బీబర్‌కు వల్లమాలిన ప్రేమ ఉంది. తన జీవితంలో సరైన భాగస్వామి అని భావిస్తున్నాడు. తన పిల్లలకు ఆమె తల్లి అయితే బాగుంటుందని బలంగా నమ్ముతున్నాడు అని హాలీవుడ్ పత్రిక పేర్కొన్నది. అయితే హెయిలీ పెళ్లి విషయంలో బీబర్ కుటుంబ సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

    ఆస్ట్రేలియాలో పెళ్లికి ఏర్పాట్లు

    ఆస్ట్రేలియాలో పెళ్లికి ఏర్పాట్లు

    బీబీర్ పెళ్లి, హోయిలీ ప్రెగ్నేన్సీ ఊహాగానాల మధ్య వీరిద్దరి పెళ్లి త్వరలోనే ఆస్ట్రేలియాలో జరుగబోతున్నది అనే సరికొత్త వార్త మీడియాలో వైరల్ అవుతున్నది. క్రిస్టియన్ మతంలో వీరిద్దరూ వేర్వేరు వర్గాలకు చెందిన వారు కావడం కొంత సమస్యగా మారే అవకాశం లేకపోలేదంటున్నారు. ఆస్ట్రేలియాలోని హిల్ సాంగ్ చర్చిలో వీరి పెళ్లి జరుగనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

    English summary
    Justin Bieber and his fiancé Hailey Baldwin's Marriage news is making headlines. A recent report suggest that Hailey was got a pregnancy and how the 'Baby' singer cannot wait to become a father.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X