రహస్యంగా జస్టిన్ బీబర్ ఎంగేజ్మెంట్, సూపర్ మోడల్‌తో త్వరలో పెళ్లి?
పాప్ సంచలనం, ప్రపంచ వ్యాప్తంగా తన పాటలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న పాప్ స్టార్ జస్టిన్ బీబర్ పెళ్లి గడియలు దగ్గరపడ్డాయి. 24 ఏళ్ల ఈ కెనడియన్ స్టార్ అమెరికన్ సూపర్ మోడల్, 21 ఏళ్ల హెయిలీ బాల్డ్విన్‌ను అతడు పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది.
కొంతకాలంగా జస్టిన్ బీబర్, హెయిలీ బాల్డ్విన్ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకుని సెటిలవ్వాలని నిర్ణయించుకున్నారని, ఇటీవలే వీరి ఎంటేజ్మెంట్ కూడా జరిగినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

జస్టిన్ బీబర్ ఇంతకు ముందు హాలీవుడ్ నటి, పాప్ స్టార్ సెలీనా గోమెజ్‌తో చాలా కాలం పాటు ప్రేమాయణం కొనసాగించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అయితే పలు కారణాలతో ఇద్దరూ విడిపోయారు.
సెలీనా కంటే ముందే... బీబర్ హెయిలీ మధ్య లవ్ రిలేషన్ ఉంది. ఆమెతో విడిపోయిన తర్వాత మళ్లీ ఈ ప్రేమ జంట ఒక్కటయ్యారు. త్వరలోనే వీరి పెళ్లిభాజా మ్రోగబోతోంది. వచ్చే క్రిస్మస్‌లోపే వీరి వివాహం జరిగే అవకాశం ఉందని టాక్.


Click it and Unblock the Notifications











