»   » శవపేటికపై నగ్నచిత్రాలు ప్రజల్లో చైతన్యం కొరకే...

శవపేటికపై నగ్నచిత్రాలు ప్రజల్లో చైతన్యం కొరకే...

By Nageswara Rao
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  టీనేజి సింగర్స్, టీన్ ఛాయిస్ అవార్డ్ విన్నర్స్ జస్టిన్ బైబర్ అతని గర్ల్ ప్రెండ్ సెలీనా గోమెజ్ నగ్న చిత్రాలను నగ్న విగ్రహాలుగా రూపోందించారు. ఇంతకీ ఈ నగ్న చిత్రాలను రూపోందించి ఎక్కడో తెలుసా శవపేటిక మీద. అంతేకాకుండా వీరిద్దరిని 21వ శాతబ్దపు ప్రేమికులుగా అభివర్ణించారు ప్రముఖ అమెరికన్ డేనియల్ ఎడ్వర్డ్స్. ఇద్దరు టీనేజర్స్‌ని నగ్నంగా రూపోందించి వారియొక్క చూడకూడని ప్రదేశాలను మాత్రం కెనడియన్ మ్యాపిల్ ఆకుతో కనిపించకుండా చేశారు.

  శవపేటిక మీద చిత్రించినటువంటి వీరి విగ్రహాలను గోమెజ్ హుం టైన్‌కి దగ్గరలో ఉన్న డల్లాస్ ఫైన్ ఆర్ట్స్‌లో ఉంచడం జరిగింది. ఈ విగ్రహాలలో మరో ప్రత్యేకమైన విషయం కూడా ఉంది. అదేంటంటే రెండు విగ్రహాలకు కలిపి మూడు కాళ్లనే సృష్టించారు సృష్టికర్త. జస్టిన్, సెలీనా గోమెజ్ ఇద్దరూ కూడా ఒక్కరి మాదరే ఉండి తమయొక్క నడుం నుండి మోచేతి వరకు కూడా కలసిఉండిపోయే విధంగా రూపోందించారు. సెలీనా గోమెజ్ కుడి కాలుని, జస్టిన్ యొక్క ఎడమ కాలుతో షేర్ చేసి మూడు కాళ్లను ఉండేవిధంగా రూపోందించారు. ప్రక్క చిత్రంలో ఉన్న ఇమేజిని గనుక చూస్తే మీకు ఇట్టే అర్దం అవుతుంది.

  ఈ విగ్రహాలను తయారు చేయడానికి కారణం కెనడియన్ సింగర్ అయినటువంటి జస్టిన్ బైబర్ కెనడా నేషనల్ హెల్త్ కేర్ సిస్టమ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్నారు. ఈ సందర్బంగా డేనియల్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ కెనడా యొక్క ఎంబసీ ఆధారంగా ఈ విగ్రహాలను తయారు చేయడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా కెనడా యొక్క ఆర్ట్ అండ్ కామర్స్ యావత్ ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం కెనడా మెడికేర్ AAA క్రెడిట్ రేటింగ్‌లో ముందంజలో ఉంది. వీరిద్దరిని ఇలా చూపించడం వల్ల యంగ్ కపుల్స్ వారి ఆలోచలను ప్యామిలీ వైపుకు నడిపే విధంగా ఉండాలని ఇలా రూపోందించడం జరిగిందని అన్నారు.

  ఇదే సందర్బంలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజీలీనా జోలీ శిశువుకు పాలిస్తున్న కంచుతో తయారు చేస్తున్న నగ్న విగ్రహాన్ని అమెరికా నడివీధిలో పెట్టిన సంగతిని గుర్తు చేశారు. న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ శిల్పి డేనియల్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ, శిశువుగా పాలిస్తున్నట్లుగా తాను మలుస్తున్న ఏంజిలీనా నగ్న విగ్రహం తల్లుల్లో చైతన్యం తీసుకు వస్తుందని చెప్పాడు. ముఖ్యంగా చంటి పిల్లలకు తల్లిపాలు ఎంత ముఖ్యమో ఈ విగ్రహం తెలియజేస్తుంటున్నాడు. ఈ ఇమేజిని ఏంజిలీనా తన ఇద్దరి కవలలకు పాలిస్తున్నప్పుడు తన బాయ్‌ఫ్రెండ్ బ్రాడ్ పిట్ ఫోటో తీశాడు. ఆ ఫోటో ఆధారంగా ఈ నగ్న విగ్రహాన్ని తయారు చేస్తున్నానని డేనియల్ వెల్లడించాడు.

  English summary
  Teen Choice Award winners Bieber and Selena Gomez are presented as a 21st Century Adam and Eve in a new life size portrait created by American Daniel Edwards. It depicts the teenagers almost entirely nude, with a Canadian maple leaf and a Texas lone star covering their most intimate parts.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more