మాది కేవలం స్నేహం మాత్రమే, ఆ సంబంధం కాదంటున్న పాప్ సింగర్
పాప్ యువ తరంగం జస్టిన్ బైబర్ తన స్నేహితురాలు అయినటువంటి సెలినా గోమెజ్ ఇద్దరి మద్యా ఉన్నటువంటి సాన్నిహిత్యం రోజురోజుకీ పెరిగిపోతుందని అనుకుంటున్నారు హాలీవుడ్ సినీ విమర్శకులు. ఇటీవల కాలిఫోర్నియాలోని శాంతా మోనికాలో కనిపించిన విధానమే దీనికి ప్రతిబింబిస్తుందని పెద్దలు అంటున్నారు. ఇద్దరూ ఒకరికోకరు చెట్టాపట్టాలేసుకోని మరీ శాంతా మోనికా వీధుల్లో రెచ్చిపోతున్నారు.
గతంలో జస్టిన్ బైబర్ పలుమార్లు ఇంటర్యులలో సెలినా గోమెజ్ తనకి ఉన్నటువంటి ప్రాణ స్నేహితులలో ఒకరు అని అనడం జరిగింది. ఇప్పుడు ఆ స్నేహామే వారిద్దరిని బాగా చనువుగా చేసిందని సమాచారం. కాలిఫోర్నియాలోని శాంతా మోనికాలోని ఫోటోలను చూసినట్లైతే జస్టిన్ బైబర్ సెలినా గోమెజ్ వీపు వెనుక భాగాన అమాంతం వాటేసుకోవడం జరిగింది. ఈఫోటోలు బయటకు రావడంతో వీరిద్దరి మద్యా స్నేహం కంటే కూడా ఏదో బలమైన సంబంధం ఉందని రూమర్స్ రావడం విశేషం.
ఐతే ఈవిషయంపై స్పందించినటువంటి జస్టిన్ బైబర్ మాత్రం మా ఇద్దరి మద్యా ఆ సంబంధం లేదు కేవలం మంచి స్నేహితులం మాత్రమే అని అన్నారు. ఇలాంటి రూమర్స్ గతంలో కూడా పలుమార్లు మాపై సృష్టించిన విషయం తెలిసిందేనని అన్నారు.


Click it and Unblock the Notifications











