హావాయి బీచ్‌లో ముద్దులు పెట్టుకుంటూ కెమెరాకి చిక్కిన జంట
కొన్ని జంటలు ఎల్లప్పుడూ వార్తల్లోనే ఉండాలని ఉండాలని తహాతహాలాడుతుంటాయి. అటువంటి జంటల్లో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ జంట సింగర్ జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్. కెనడాకి చెందినటువంటి ఈ పాప్ యువతరంగం తన పాటలతో యావత్ ప్రపంచాన్ని ఊర్రుతలూగించాడు. ప్రస్తుతం ఈ జంట హావాయిలోని మాయి బీచ్‌లలో ఎంజాయ్ చేస్తూ కెమెరాకి చిక్కారు. హావాయి బీచ్‌లో ఇద్దరూ ఎంచక్కా ముద్దులతో కేరింతలు కొడుతూ కెమెరా కంట్లో పడ్డారు.
వివరాల ప్రకారం సెలీనా గోమెజ్ పింక్ టూ పీస్ బికనీ ధరించగా, జస్టిన్ బైబర్ మాత్రం పాయింట్ ధరించాడు. వీరిద్దరూ రోజు మొత్తం కలసి హావాయి బీచ్‌లో ఎంజాయ్ చేశారని సమాచారం. అక్కడ వారిద్దరిని చూసిన వారు చెప్పిన మాటల ప్రకారం వీరిద్దరు నీళ్శతో ఆడలాడుకోవడం, జెట్ - స్కై మీద రైడింగ్, పారాసైలింగ్‌తో పైకి ఎగరడం లాంటివి చేశారని అన్నారు. ఒకానోక సందర్బంలో జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్‌ని తన చేతులతో పైకి లేపి ముద్దు కూడా పెట్టుకున్నాడని అన్నారు.
జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ ఇద్దరూ కూడా వోకేషన్ కోసం మాయికి రావడం నాలుగు నక్షత్రాల హొటెల్‌లో బసచేయడం జరిగిందని అన్నారు. వీరిద్దరూ కలిసి మూడు బెడ్ రూమ్ గదులు కలిగినటువంటి రూమ్‌ని వాళ్శ తల్లిదండ్రులతో షేర్ చేసుకోవడం జరిగిందని తెలియజేశారు.


Click it and Unblock the Notifications











