యాక్షన్ హీరో కావాలన్నది నా కోరిక
లాస్ ఏంజిల్స్: మానవుల కోరికలు అనంతం. వారి వారి ఆలోచనలను బట్టి వారి కోరికలుంటాయి. హాలీవుడ్ యువ సింగర్ జస్టిన్ బైబర్‌కు యాక్షన్ హీరో కావాలనే కోరిక అంట. ఐతే ఈ కోరికను పూర్చి చేసుకోవడానికి గాను నటుడు-నిర్మాత మార్క్ వాల్ బెర్గ్ యొక్క సహాయం తీసుకోనున్నట్లు తెలిపాడు.
జస్టిన్ బైబర్‌కు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. కానీ అతను తన సొంత ప్రాజెక్ట్ ద్వారా ఈ కలని నిజం చేసుకోవాలని భావిస్తున్నాడు. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు నటుడు, నిర్మాతగా వ్యవహారించే వాల్ బెర్గ్ అంటే బైబర్‌కు చచ్చేంత ఇష్టం.
ఐతే జస్టిన్ బైబర్ యాక్షన్ సినిమాలలో నటించేంత ఫిజిక్‌ని కలిగి లేకపోవడం కాస్త నిరాశ చెందాల్సిన విషయం. ఐతే త్వరలో తన పర్సనల్ ట్రైనర్ ద్వారా యాక్షన్ సినిమాలలో నటించడానికి కావాల్సిన ఫిజిక్‌ని సొంతం చేసుకోవడానికి తాను సిద్దమని తెలిపాడు. హాలీవుడ్ టీనేజ్ పాప్ సింగర్ జస్టిన్ బైబర్‌కు తన స్నేహితులురాలు సెలెనా గోమెజ్‌తో నిశ్చితార్థం అయిందంటూ వస్తున్న వార్తలను బైబర్ అధికార ప్రతినిధి కొట్టి పారేశారు. ఇది ఇలా ఉంటే జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ ఇద్దరూ 2010 నుండి డేటింగ్‌లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











