Lock upp లో విల్ స్మిత్.. చెంప దెబ్బ ఘటనపై కంగన రనౌత్ కామెంట్స్ వైరల్
ప్రపంచ సినిమా రంగంలో నోబెల్ అవార్డులగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుకల భారీ అపశృతి చోటు చేసుకొన్నది. అవార్డుల కార్యక్రమం రసవత్తరంగా జరుగుతున్న సమయంలో తన భార్య జాడా పింకెట్ స్మిత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కామెంటేటర్ క్రిస్ రాక్‌ను హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ చెంప దెబ్బ కొట్టడం రసాభాసగా మారింది. ఈ ఘటన అవార్డుల వేడుకపై మచ్చగా మారిందనే చెప్పాలి. అయితే ఈ వివాదంలో బాలీవుడ్ నటి కంగన రనౌత్ జోక్యం చేసుకొన్నారు. అవార్డుల ఘటనకు కారణం ఏమిటి? కంగన రనౌత్ ఏమని కామెంట్ చేసిందంటే..
Recommended Video


స్టేజ్‌పైకి వెళ్లి చెంపదెబ్బ
అవార్డుల ప్రజెంటర్ రాక్ మాట్లాడుతూ.. పింకెట్ స్మిత్ జీఐ సేన్ అనే సీక్వెల్ తప్పకుండా నటించాలి అని జోకులు వేశాడు. రాక్ మాటలు విన్నవెంటనే పింకెట్ స్మిత్ కంటతడి పెట్టుకొన్నది. దాంతో సహించలేని విల్ స్మిత్ వెంటనే వేదికపైకి వెళ్లి రాక్ చెంపపై గట్టిగా కొట్టాడు. దాంతో ఆడిటోరియంలో ఉన్న ప్రముఖులంతా షాక్ తిన్నారు.

పాత్ర కోసం గుండు చేసుకోవడంపై
క్రిస్ రాక్‌ను చెంప దెబ్బ కొట్టడానికి అసలు కారణమేమిటంటే.. ఇటీవల ఓ చిత్రంలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అలోపేసియా అనే శారీరకంగా రుగ్మతలతో బాధపడే యువతిగా పింకెట్ స్మిత్ నటించింది. ఈ పాత్ర కోసం పింకెంట్ స్మిత్ ఏకంగా గుండు కొట్టించుకొంది. అయితే ఆ నటించిన పాత్రపై రాక్ జోకులు విసరడంతో విల్ స్మిత్‌కు పీకల్లోతు కోపం వచ్చింది. దాంతో స్టేజ్ మీదకు దూసుకెళ్లి గట్టిగా కొట్టడం జరిగింది.

నేను ప్రేమించే వ్యక్తిని అవమానిస్తే..
క్రిస్ రాక్ ఘటనపై విల్ స్మిత్ స్పందిస్తూ.. ప్రేమ ఎంతటి పిచ్చి పనులైనా చేయిస్తుంది అంటూ కామెంట్ చేశారు. ప్రజలను ప్రొటెక్ట్ చేశాడు. ప్రజలను ప్రేమించాలని చెబుతుంటాను. ఒకరిపై పిచ్చిగా ప్రేమ ఉంటే.. ఎలాంటి పనులైనా చేయాల్సి వస్తుంది. నన్ను గానీ, నేను ప్రేమించే వ్యక్తిని అవమానిస్తే సహించలేను. ఈ ఘటనలో నాకు అండగా నిలిచిన డెంజెల్ వాషింగ్టన్‌కు థ్యాంక్సూ అని విల్ స్మిత్ అన్నాడు.

చెంపదెబ్బ.. నైట్ పార్టీలో విల్ స్మిత్
ఆస్కార్ 2022 అవార్డుల వేడుకలో విల్ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకొన్నారు. ఈ అవార్డు అందుకొన్న తర్వాత ఆనంద క్షణాలను ఆస్వాదించారు. ఆస్కార్ అవార్డుల వేడుక అనంతరం భార్య జాడా పింకెట్ స్మిత్‌తో కలిసి పార్టీ చేసుకొన్నారు. భార్యతో కలిసి విందులో డ్యాన్సులు చేస్తూ స్టెప్పులు వేస్తూ కనిపించాడు.

కంగనరనౌత్ కామెంట్ ఏమిటంటే?
ఒకవేళ నా తల్లిని లేదా చెల్లి ఆరోగ్యం గురించి ఓ ఇడియెట్ అవమానించే విధంగా మాట్లాడితే.. కొందరు వెధవల సమూహం ఆనందపడి, గేలి చేస్తే విల్ స్మిత్ మాదిరిగానే నేను చెంప దెబ్బ కొడుతా. ఈ ఊహించని ఘటనతో వార్తల్లో వ్యక్తిగా నిలిచిన విల్ స్మిత్ నా రియాలిటీ షో లాకప్‌లోకి వస్తాడని అనుకొంటాను అని కంగన రనౌత్ చెప్పింది.


Click it and Unblock the Notifications











