For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నన్ను బంధించే కుట్ర.. అబార్షన్‌కు ప్రయత్నాలు.. కిమ్ కర్దాషియాన్‌పై భర్త ఆరోపణలు

  |

  అమెరికా అధ్యక్ష పదవి బరిలోకి దిగిన హాలీవుడ్ ర్యాపర్ కాన్యే వెస్ట్ వరుస ట్వీట్లతో కలకలం సృ‌ష్టించారు. తన భార్య కిమ్ కర్దాషియాన్‌పై ఆరోపణలు చేస్తూ మీడియాను ఆకర్షించాడు. మానసికంగా తాను సరిగా లేననే కారణంతో తనను బందీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నా జీవితం హాలీవుడ్ సినిమాను తలపిస్తుందని వరుస ట్వీట్లు చేయడంతో హాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి రాజకీయాలు కేంద్ర బిందువుగా మారాయనే వాదన వినిపిస్తున్నది. ఇంతకు ఈ వ్యవహారంలో ఏం జరిగిందంటే..

  యూఎస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలోకి కాన్యే

  యూఎస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలోకి కాన్యే

  నవంబర్‌లో ప్రారంభమయ్యే అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు గాయకుడు కాన్యే వెస్ట్ సిద్ధమవుతున్నాడు. ఏకంగా తన అభిమాన నాయకుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోటీకి సిద్ధమవుతున్నాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దూకితే తాను మద్దతిస్తానని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించడంతో యూఎస్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకొన్నాయి. కాన్యేకు మద్దతుగా నిలుస్తామని మరొకొందరు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడంతో రాబోయే ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

  ప్రచారం ప్రారంభించిన మరుసటి రోజే రచ్చ

  ప్రచారం ప్రారంభించిన మరుసటి రోజే రచ్చ

  ఇలాంటి పరిస్థితుల్లో కాన్యే వెస్ట్ సోమవారం రోజున వరుస ట్వీట్లతో హల్‌చల్ చేశారు,. కాన్యే ఇలా ట్వీట్లు చేస్తున్నారనే అనుకొంటుండగానే ఆ ట్వీట్లను వెంటనే తొలగించారు. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల కోసం సౌత్ కరోలినాలో ప్రచారం ప్రారంభించిన మరుసటి రోజే ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడంతో ఏం జరుగుతున్నదనే ఆందోళన అభిమానుల్లో మొదలైంది.

  నన్ను గదిలో బంధించే కుట్ర

  నన్ను గదిలో బంధించే కుట్ర

  కిమ్ కర్దాషియాన్‌ను అబార్షన్ చేసుకోవద్దని హెచ్చరించడం వల్లే నాకు నా భార్యకు గొడవ మొదలైంది. నన్ను గదిలో బంధించి డాక్టర్‌తో కలిసి పారిపోయేందుకు ప్రయత్నించింది. దాంతో నా కూతుళ్ల జీవితాన్ని కాపాడాలని ఏడ్చాను అంటూ కాన్యే ఓ ట్వీట్‌లో వెల్లడించారు. నాకు ఫోన్ చేసి నన్ను వెంటనే సంప్రదించండి అంటూ కిమ్, ఆమె తల్లిని వేడుకొంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను మరికొద్ది సేపటికే డిలీట్ చేయడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.

  మండేలా మాదిరిగా గృహ నిర్బంధం

  మండేలా మాదిరిగా గృహ నిర్బంధం

  ఒకవేళ నన్ను కూడా మండేలా మాదిరిగా బంధించే ప్రయత్నం జరుగుతుందా అనే అనుమానం కలుగుతున్నదని అన్నారు. గతంలో దక్షిణాఫ్రికాలో స్వేచ్ఛ, మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న మండేలాను మూడు దశాబ్దాలపాటు గృహ నిర్బంధంలో ఉంచిన విషయాన్ని తనకు అన్వయించుకొన్నారు. తన మానసిక పరిస్థితి బాగాలేదనే కారణం చూపి డాక్టర్‌తో కలిసి బంధించే కుట్రకు కిమ్ తెర లేపుతున్నది అని కాన్యే ఆరోపణలు చేశారు.

  గెట్ అవుట్ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా

  గెట్ అవుట్ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా

  నా జీవితానికి హాలీవుడ్ చిత్రం గెట్ అవుట్ మూవీకి సంబంధముంది. ఆ సినిమా నా జీవితం గురించే అనే విషయం అందరికి తెలిసిందే అంటూ ట్వీట్ చేశారు. అయితే రాజకీయాల్లోకి వెళ్లే విషయంలో కిమ్ కర్దాషియాన్‌కు మధ్య తలెత్తిన అభిప్రాయబేధాల వల్లే ఇదంతా జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తన మ్యూజిక్ ఆల్బమ్‌ను రికార్డుస్థాయిలో అమ్ముకోవడానికి కాన్యే వెస్ట్ చేస్తున్న పబ్లిక్ స్టంట్ అంటూ కొందరు విమర్శిస్తున్నారు.

  English summary
  Hollywood rapper Kanye West, Who is in US presidential race alleges his wife Kim Kardashian. He tweeted that Kim is trying to locked up in room on Medical grounds. He attempted serial tweets, He deleted all the tweets after few hours.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X