'హై హీల్స్' ధరిస్తే సెక్సీగా కనిపిస్తా: టివి స్టార్
రియాలిటీ టివి స్టార్ కిమ్ కర్దాషియాన్ హై హీల్స్‌ని ధరిస్తే తాను చాలా సెక్సీగా, హుందాగా కనిపిస్తానని తెలిపింది. ఇక వివరాల్లోకి వెళితే కిమ్ ఇటీవల కాస్మోపోలిటియన్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ.. నేను పూర్తి మేకప్‌తో ఏదైనా ఫోటోషూట్‌లో పాల్గోన్నప్పడు తప్పని సరిగా నాకు హై హీల్స్ అవసరం ఎందుకంటే నేను హై హీల్స్ ధరించినప్పుడే సెక్సీయస్ట్‌గా కనిపిస్తానని భావిస్తాను. దీనికి కారణం లేకపోలేదు. నేను ఎత్తు తక్కువగా ఉంటాను కాబట్టి, చూసేందుకు కరెక్టుగా ఉండాలి. అందుకే హై హీల్స్‌ని ఎక్కువగా ఫోటో షూట్‌లలో వినియోగిస్తాను.
కిమ్ కర్దాషియాన్ చెప్పిన దాని ప్రకారం తాను మిర్రర్ ముందు నిలబడితే సెక్సీనెస్ అనేది తనలో లేదని చెప్పకనే చెబుతుంది. నేను ఎప్పుడూ మిర్రర్‌ని దాచి పెడతాను. అందుకు కారణం లోదుస్తుల షూటింగ్ సమయంలో మిర్రర్ మనల్నిసెక్సీ ఉన్నట్లు విశ్వాసాన్ని కలగజేస్తుంది. లో దుస్తుల షూటింగ్ ఎప్పుడూ అసౌకర్యంగా ఉంటుంది. కానీ మనలో ఉన్న ది బెస్ట్‌ని అభిమానులు ఆనందించేలా ఇవ్వడమే మన కర్తవ్యమని కిమ్ అన్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకోని 72 రోజులు గడవక ముందే తన భర్త బాస్కెట్ బాల్ ప్లేయర్ క్రిస్ హాంప్రస్ నుండి విడాకులు తీసుకున్న కిమ్ కర్దాషియాన్ ఇప్పుడు డేటింగ్ చేసేందుకు గాను లాయల్ లేదా బిజినెస్ మ్యాన్ కోసం వెతుకులాట ప్రారంభించింది. 31 సంవత్సరాల వయసు కలిగిన కిమ్ కర్దాషియాన్ తన భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత సింగల్‌గా జీవిస్తున్న విషయం తెలిసిందే. కర్దాషియాన్ సిస్టర్సైన కోల్ కర్దాషియాన్, కోర్ట్నీ కర్దాషియాన్ ఇద్దరూ అక్క సింగల్‌గా జీవించడం చూసి ఇష్టం లేక అక్క కిమ్ కోసం బాయ్ ప్రెండ్‌ని వెతకడం ప్రారంభించారు.


Click it and Unblock the Notifications











