ఆరు నెలలుగా డేటింగ్.. అతనే నా ఫర్‌ఫెక్ట్ మ్యాచ్
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ బిగ్ సెలబ్రిటీ, రియాలిటీ టివి స్టార్ కిమ్ కర్దాషియాన్ అమెరికా చాట్ షో 'ది వివ్' లో ఇప్పటి వరకు తన జీవితంలో ఎంతో మందితో కలిసి తిరిగినా... వారందిరలోనూ కేన్ వెస్ట్ తనకి 'ఫర్‌ఫెక్ట్ మ్యాచ్' అని తెలిపింది. కేన్ వెస్ట్‌తో కిమ్ కర్దాషియాన్ గత ఆరు నెలలుగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బంధాన్ని కిమ్ కర్దాషియాన్ శాశ్వత సంబంధం వైపు మరలచుకోవాలని యత్నిస్తున్నానని చెప్పింది .
శాశ్వత సంబంధం అంటే అన్న ప్రశ్నకు గాను గత ఆరు నెలలుగా నేను, కేన్ వెస్ట్ వివాహం కాకుండానే డేటింగ్ చేసుకుంటున్నాం. ఐతే ఈ బంధాన్ని వివాహం ద్వారా శాశ్వత బంధం చేయాలని అనుకుంటున్నానని బదులిచ్చారు. అందమైన ప్రపంచంలో మీకు ఖచ్చితమైన మనిషి దొరికినప్పుడు నిజంగా మీ నోటి వెంట 'ఫర్‌ఫెక్ట్ మ్యాచ్' అనే పదం వస్తుందని చెప్పింది.
31 సంవత్సరాల వయసు కలిగిన కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్ ఇద్దరూ గత పది సంవత్సరాలుగా ఒకరికి ఒకరు తెలుసు. ఇటీవలే కిమ్ కర్దాషియాన్ బాస్కెట్ బాల్ ఆటగాడు క్రిస్ హాంప్రస్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే కొన్ని కారణాల వల్ల 72 రోజులు గడవక ముందే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నుండి కిమ్ కర్దాషియాన్, సింగర్ కేన్ వెస్ట్‌తో సన్నిహితంగా మెలుగుతున్నారు.
కేన్ వెస్ట్‌తో నా సంబంధం పదిలంగా ఉంటుందని, అందుకు కారణం రొమాన్స్ చేయడానికి ముందే మేమిద్దరం ధృడమైన స్నేహా బంధాన్ని నిర్మించుకున్నామని చెప్పారు. క్రిస్ హాంప్రస్‌ని పెళ్లి చేసుకోవడానికి ముందే కొన్ని సంవత్సరాలుగా కేన్ వెస్ట్, కిమ్‌కి మధ్య మంచి స్నేహా సంబంధాలున్నాయని.. మా ఇద్దరి మధ్య రొమాన్స్ చక్కగా ఉండేందుకు ఈ స్నేహాం అనుకూలిస్తుందని పేర్కొంది. మా ఇద్దరి గురించి మాకు బాగా తెలుసు. ఇద్దరి మనుషుల మధ్య మంచి రిలేషన్‌షిప్ కొనసాగాలంటే స్నేహం ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని తెలిపింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











