నాకంటే వయసులో పెద్దవాడినే పెళ్లి చేసుకుంటా..!!
రియాలిటీ టివి స్టార్ కేట్ గోసలిన్ తన భర్త నుండి ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తన భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత కేట్ గోసలిన్ ఆ తన భర్త స్దానంలో రాబోయే మరో వ్యక్తి తన కంటే వయసులో చాలా పెద్దవాడు ఐతే బాగుంటుందని తన అబిప్రాయాన్ని తెలిపింది. ప్రస్తుతం 36 సంవత్సరాలు ఉన్న కేట్ గోసలిన్ ఇలా వయసులో తనకంటే కూడా పెద్ద వాడిని కోరుకోవడానికి కారణం సోసైటీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన హోదా రావడం కోసమేనని తెలిపారు.
ఎనిమిది మంది పిల్లలకు తల్లి అయినటువంటి కేట్ గోసలిన్ తమ మాజీ భర్త జాన్ గోసలిన్ వయసు తనకంటే కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పెద్దవాడని తెలిపారు. దాంతో తన పర్సనల్ లైప్ మీద తన భర్త వయసు విడాకులు తీసుకోవడానికి కారణం అవడంతో తనకు రాబోయే మరో రోమాంటిక్ భర్త మాత్రం వయసులో తనకంటే చాలా ఎక్కువ కలిగనవాడై ఉండాలని ఆమె కొరుకుంటుంది.
తన భర్తనుండి విడాకులు తీసుకున్న తర్వాత కేట్ గోసలిన్ తన పిల్లలు గురించి తగు జాగ్రత్తులు తీసుకుంటున్నారు. ఈ సందర్బంలో కేట్ గోసలిన్ మాట్లాడుతూ ఎనిమిది పిల్లలకు తల్లిగా ఉండాలంటే అది చాలా ఛాలెంజింగ్‌తో కూడుకున్న పని అన్నారు. ప్రస్తుతం జీవితంలో నేను కొన్ని అడ్డంకులను ఎదుర్కొవడం జరుగుతుందని త్వరలోనే వాటి అన్నింటిని అధిగమించి నా రియల్ లైఫ్ రొమాంటిక్ హీరోని కలస్తానని అన్నారు.


Click it and Unblock the Notifications











