పెళ్లికి సిద్ధమయిన హాలీవుడ్ హాట్ తార కేట్ హుడ్సన్
'ఫూల్స్ గోల్డ్' చిత్రనాయిక కేట్ హుడ్సన్ ఉంగరాలు మార్చుకోవడానికి సిద్ధం అయింది. బేస్ బాల్ క్రీడాకారుడు అలెక్స్ తో డేటింగ్ చేస్తున్న ఈమె అతన్ని త్వరలో పెళ్లి చేసుకోనుందనే వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ హాట్ తారగా పేరొందిన ఈమె అలెక్స్ తో మే నుండీ డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఇరుక్కుపోయారనే వార్తలు వస్తూనే వున్నాయి. తొలుత దీనిపై స్పందించని వీరు తాజాగా వస్తున్న వార్తలపై కూడా మౌనంగా వున్నారు. కానీ వారి సన్నిహితులు మాత్రం త్వరలో వారు ఎంగేజ్ మెంటుని ప్రకటిస్తారని ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











