twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె అందం అద్భుతం: జోన్ రివర్స్

    By Nageswara Rao
    |

    లండన్: అమెరికన్ కమెడియన్ జోన్ రివర్స్ అతని కూతురు మెలిస్సా ఇద్దరూ ఇటీవల జరిగిన ఫ్యాషన్ దివా 'డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జి' కార్యక్రమంలో పాల్గోన్న సమయంలో మాట్లాడుతూ ప్రపంచంలో మాకు నచ్చిన ఫ్యాషన్ ఉమెన్‌గా 'కేట్ మిడిల్టన్' ని అభివర్ణించారు. 78సంవత్సరాలు వయసు కలిగిన జోన్ రివర్స్ ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించారు. కేట్ మిడిల్టన్ నడిచేటటువంటి నడక తీరుని గమనించిన ప్రతి ఒక్కరూ కూడా ఇలానే మాట్లాడుతారు.

    కేట్ మిడిల్టన్ ఎప్పుడు కూడా తన యొక్క పాదాలను ఫ్యాషన్ ఉమెన్ మాదిరిగానే నడవడం తాను చూశానని తెలిపారు. ఎట్టి పరిస్దితులలోను తన పాదాలను తప్పుగా వేయరని అన్నారు. మెలిస్సా మాట్లాడుతూ సాధారణంగా మేము ప్యాషనైట్స్‌కి డ్రస్సులు తయారు చేయడం జరుగుతుంది. ఫ్యాషనైట్స్ ఏవిధంగా నైతే వారు డ్రస్సుకి అనుగుణంగా నడుస్తారో అచ్చం కేట్ మిడిల్టన్ కూడా అలానే నడుస్తారని అన్నారు.

    కేట్ మిడిల్డన్ పెళ్లి సందర్బంగా తన గౌనుని రూపొందించిన సారా బుర్టన్ ఈ ఫ్యాషన్ ట్రెండ్‌ని ప్రారంభించడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఇటీవల లండన్ ప్రముఖ వెబ్ సైట్ వోచర్ కొడ్స్ నిర్వహించిన 'క్వీన్ ఆఫ్ హై స్ట్రీట్ ప్యాషన్' సర్వేలో కేట్ మిడిల్టన్ మొట్టమొదటి స్దానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. బ్రిటన్ యువరాజు విలియమ్స్, కేట్ మిడిల్‌టన్‌ల వివాహానికి 1900 మంది అతిథుల మద్య అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

    English summary
    American comedian Joan Rivers and her daughter Melissa describe Kate Middleton, the Duchess of Cambridge, as a true fashion diva. "Shes fabulous, she doesnt put a foot wrong," quoted the Rivers, 78, as saying.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X