»   » నేడు ముద్దు పెట్టిన ఆమె రేపు ఇంకేం చేస్తుందో మరి..

నేడు ముద్దు పెట్టిన ఆమె రేపు ఇంకేం చేస్తుందో మరి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తను ఓ ఆసుపత్రికి సాయం చెయ్యాలనుకుంది. అది డబ్బురూపేనా చెయ్యాలని ఆమె భావించింది. ఇందుకోసం ఆమె తనని తాను సమర్పించుకుంది..అది ముద్దు వరకే లెండి. అబ్బో ఎంత గొప్ప మనసు ఇతరుల కోసం ఎంత మంచి పని చేసింది అని అభినందిస్తున్నారా..? ఆగండాగండి ఆమె గురించి చెబితే మీకూ ఈమె ఈ పని ఎందుకు చేసిందా అని అనుమానాలు వస్తాయి. అదేంటంటే డబ్బు సాయం చెయ్యాలనుకున్న ఆమె డబ్బు ఇవ్వచ్చుగా.. మరీ ఇంత బరితెగించి పబ్లిక్ గా ముద్దు పెట్టుకొని డబ్బు వసూలు చెయ్యాలా అని అనిపిస్తుంది. ఆమె ఓ సూపర్ మోడల్ కావడమే ఈ అనుమానాలకు తావిచ్చింది. ఆమె క్యాటీ మోస్.

ఈ భామ తన ముద్దును కొనమని తనని తాను వేలం వేసుకుంది. అందులో ఓ రసికుడు 5000 పౌండ్లు (సుమారు రూ.3 లక్షలా 70 వేలు) చెల్లించి ఆమె ముద్దును కొన్నాడు. ఆమె అందరి ముందూ..తన బాయ్ ఫ్రెండ్ కూడా వున్నాడు లెండి అక్కడే అతగాడిని ముద్దుపెట్టుకుని వాడి కోర్కెను తీర్చిందట. అంతటితో కథ అయిపోలేదు. ఈ రసశిఖామణి గారు క్యాటీ మోస్ తో సెక్స్ చెయ్యాలనే అభిలాషను వ్యక్తపరిచాడట. దీనికోసం ఎంత చెల్లించడానికైనా వెనుకాడను అని చెప్పి క్యాటీ బాయ్ ఫ్రెండ్ గుండెల్లో అగ్నిపర్వతం బద్దలయ్యేలా చేసాడు.

వీటికి తోడు అతని సన్నిహితులు కూడా క్యాటీ సాయం చెయ్యలనుకుంటే ఆమెకు డబ్బు కొదవా..?? కొన్ని వేల కోట్ల రూపాయలు తన వెనుకన వేసుకుంది. అలాంటిది డబ్బు సాయానికి మరీ ఇంతలా దిగజారిపోవాల.. రేపు ఎవరైనా ఇంకా డబ్బు ఇస్తామంటే మరింతగా దిగజారుతుందేమో అనే అనుమానాలు వ్యక్తపరిచారట. దీంతో ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమె మీద గుర్రుగా వున్నాడట. ఆమెతో సంబంధాన్ని ఇంతటితో ముగించాలనే ఆలోచనలో వున్నాడట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu