twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంగేజ్‌మెంట్ రింగ్ పోవడంతో చిన్న పిల్లలా ఏడ్చిన స్టార్ మోడల్

    By Nageswara Rao
    |

    సూపర్ మోడల్ కాటి మోస్‌ తనకు కాబోయే భర్త జామీ హిన్స్ ఇచ్చినటువంటి ఎంగేజ్ మెంట్ రింగ్ గ్లోస్టన్‌బరీ ఫెస్టివల్ పోగొట్టుకోవడం జరిగింది. దాని విలువ 14,000 పౌండ్స్. అసలు కాటి మోస్ గ్లోస్టన్‌బరీ ఫెస్టివల్‌కి ఎందుకు వెళ్సాల్సి వచ్చిందంటే తన కాబోయే భర్త జామి హిన్స్ సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్‌లో తన బ్యాండ్‌తో కలసి మ్యూజిక్ ఈవెంట్ ఇవ్వనున్నాడని తెలిసి అది చూడడానికి కాటి మోస్ అక్కడికి వెళ్శడం జరిగింది. కాటి మోస్ ఈ మ్యూజిక్ ఈవెంట్‌లో బిజిగా ఉండగా తన చేతికున్న రింగ్ మిస్ అవ్వడం జరిగింది.

    దాంతో అక్కడున్న వారంత కాటి మోస్ పోగొట్టుకున్న రింగ్ కోసం వెతకడం ప్రారంభించారు. స్టేజి ప్రక్కన కూర్చోని ఉన్నటువంటి కాటి మోస్ ఐతే కళ్శ వెంట నీరు వచ్చేవిధంగా ఏడవడం మొదలు పెట్టింది. ఇది మాత్రమే కాకుండా అక్కడున్న వారందరని అడుగుతూ తన మోకాళ్శ మీద ఆ రింగ్‌ని వెతకడం మొదలు పెట్టింది. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి దుమ్ము ధూళిని కూడా చూడకుండా క్రింద పడి మరీ దానిని వెతకడంలో మునిగి పోయిందని ఫీమేల్ ఫస్ట్ యుకె పత్రిక ప్రకటించింది. చివరకు తన హ్యాండ్ బ్యాగ్ క్రింద చిక్కుకొని ఉన్న తన రింగ్‌ని తన బాడీగార్డ్ వెతికి ఇవ్వడంతో అక్కడ వాతవరణం సర్దుమనిగింది. ఐతే ఇది ఇలా ఉండగా కాటి మోస్ రింగ్ పోయిన సమయంలో తను ఏడిచినటువంటి విధానం అక్కడున్న వారందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ సన్నివేశం అంతా అక్కడ ఫన్నీ వాతావరణాన్ని సృష్టించింది.

    తన బాయ్ ప్రెండ్ జామీ హిన్స్ తనకు ప్రపోజ్ చేయడంతో ఇక ఇద్దరూ పెళ్శి చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. సాధారణంగా టాప్ మోడల్స్, హీరోయిన్స్ అందరూ పెళ్శికి సంబంధించినటువంటి దుస్తులను టాప్ డిజైనర్స్ చేత డిజైన్ చేయించుకోవడం మనం విన్నాం చూశాం..కానీ దీనికి భిన్నంగా కాటి మోస్ తన వెడ్డింగ్ డ్రస్సుని తానే డిజైన్ చేసుకుంటానని అన్నారు. ఇంతకీ ఈడిజైన్ ఎవరి సమక్షంలో అనుకుంటున్నారు ష్యాషన్ మొగల్ వివిన్నీ వెస్ట్‌వుడ్. ఈ సందర్బంలో ష్యాషన్ మొగల్ వివిన్నీ వెస్ట్‌వుడ్ మాట్లాడుతూ నాకు తెలిసి కాటి మోస్ మోడల్ అవ్వడం వల్ల దుస్తులపై తనకు మంచి అవగాహాన ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఎన్నో ఫ్యాషన్ లలో ర్యాంప్ పై నడిచినటువంటి అనుభవం కాటి మోస్ ది.

    English summary
    Supermodel Kate Moss lost her engagement ring worth 14,000 pounds at the Glastonbury Festival. The English model was watching fiance Jamie Hince perform with his band The Kills at the music event in Somerset, South West England, when her vintage Twenties ring went missing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X