పెళ్శి కోసం సోంతంగా వెడ్డింగ్ డ్రస్సుని డిజైన్ చేసుకుంటున్న మోడల్
బ్రిటీష్ సూపర్ మోడల్ కాటి మోస్ త్వరలో పెళ్శి కూతురు కాబోతున్నారు. పోయిన నెలలో తన బాయ్ ప్రెండ్ జామీ హిన్స్ తనకు ప్రపోజ్ చేయడంతో ఇక ఇద్దరూ పెళ్శి చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాంతో కాటి మోస్ ప్రస్తుతం తన పెళ్శి డ్రస్సు డిజైన్ చేసే పనిలో పడ్డారు. సాధారణంగా టాప్ మోడల్స్, హీరోయిన్స్ అందరూ పెళ్శికి సంబంధించినటువంటి దుస్తులను టాప్ డిజైనర్స్ చేత డిజైన్ చేయించుకోవడం మనం విన్నాం చూశాం..కానీ దీనికి భిన్నంగా కాటి మోస్ తన వెడ్డింగ్ డ్రస్సుని తానే డిజైన్ చేసుకుంటానని అన్నారు. ఇంతకీ ఈడిజైన్ ఎవరి సమక్షంలో అనుకుంటున్నారు ష్యాషన్ మొగల్ వివిన్నీ వెస్ట్‌వుడ్.
ఈ సందర్బంలో ష్యాషన్ మొగల్ వివిన్నీ వెస్ట్‌వుడ్ మాట్లాడుతూ నాకు తెలిసి కాటి మోస్ మోడల్ అవ్వడం వల్ల దుస్తులపై తనకు మంచి అవగాహాన ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఎన్నో ఫ్యాషన్ లలో ర్యాంప్ పై నడిచినటువంటి అనుభవం కాటి మోస్ ది. తన పెళ్శికి ఎటువంటి వెడ్డింగ్ డ్రస్సు ఐతే బాగుంటుందో నాకంటే తనకే బాగా తెలుస్తుందని అన్నారు. కాటి మోస్ నాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. తను ప్రేమించినటువంటి వ్యక్తిని పెళ్శి చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.


Click it and Unblock the Notifications











