ధగధగలాడుతున్న ఆమె నగ్నత్వం, వేలానికి! (ఫోటో)
లండన్ : బ్రిటిష్ సూపర్ మోడల్ కేట్ మోస్....లేటు వయసులోనూ ఘాటైన అందాలతో అభిమానులను మత్తెక్కిస్తోంది. 39 ఏళ్ల కేట్ తాజాగా నగ్నత్వాన్ని ప్రతిభించేలా డ్రెస్సు వేసి అందరి మతులు పోగొట్టంది. నగ్న శరీరాన్ని పోలి ఉండేలా ఆ డ్రెస్‌ను ధగధగలాడే బంగారు రంగులో ప్రత్యేకంగా డిజైన్ చేసారు. చూడ్డానికి లోహపు విగ్రహంలా ఆ డ్రెస్సును డిజైన్ చేసారు. ఈ ఫోటోకు వేలంలో 30 వేల పౌండ్లు వస్తాయని ఆశిస్తున్నారు.
అయినా నగ్నంగా అందాలు ఆరబోయడం ఆమెకు కొత్తేమీ కాదు. కొన్ని రోజుల క్రితం ఎస్టి లోపెజ్ బాడీ లోషన్ యాడ్ కోసం నగ్నంగా అందాలను ఆరబోసింది. నగ్నంగా ఆమె ఒంపుసొంపులను చూసి అభిమానులు....అలాగే చూస్తూ ఉండిపోతూ రెప్ప వాల్చడానికి కూడా ఇష్ట పడటం లేదు. ఇక స్విమ్ సూట్లో ఆమె అందాల దేవతలా కనిపిస్తోందని తెగపొగిడేస్తున్నారు.

గతంలో చాలా సందర్భాల్లో కేట్ మోస్ నగ్నంగా అందాలు ఆరబోసి సంచలనం సృష్టించింది. 39 ఏళ్ల కేట్ మోస్ యుక్తవయసులో ఉన్నప్పటి నుంచే తన నగ్నం సౌందర్యాలను ఆరబోయడం మొదలు పెట్టింది. కేట్ మోస్ నగ్న చిత్రంలో ఒకటి గతంలో వేలం పాటలో సుమారు 16,250 పౌండ్లుకు అమ్ముడైంది. 1993వ సంవత్సరం జనవరిలో ప్రముఖ జర్మన్ ఎడిషన్ వోగ్ పత్రిక ప్రంట్ పేజిపై ప్రఖ్యాత కెమెరామెన్ ఆల్బర్ట్ వాట్స్‌న్ తీసినటువంటి ఈ ఫోటో అప్పటిలో పెద్ద సంచలమే సృష్టించింది.


Click it and Unblock the Notifications











