షూటింగ్ లేనప్పుడు సహాజంగా ఉండడానికే ఇష్టపడుతానంటున్న స్టార్ మోడల్
బ్రిటీష్ సూపర్ మోడల్ క్యాటి మోస్ మాట్లాడుతూ తాను ఖాళీగా ఉన్న సమయంలో సహాజంగా మేకప్ లేకుండా ఉండడానికే ఇష్టపడుతానని అన్నారు. క్యాటి మోస్ ఎక్కువగా యాడ్ క్యాంపెయిన్స్ లోనటిస్తూ ఉంటారు. యాడ్ క్యాంపెయిన్స్ అయిన తర్వాత తన ముఖాన్ని చాలా అందంగా ఎటువంటి ఫేషియల్స్ కూడా రాసుకోకుండా అలానే ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటానని అన్నారు.
నేను మేకప్ నుచాలా బాగా ఇష్టపడతాను..అది ఎప్పుడంటే నేను స్టూడియోలోఉన్నప్పుడు. అదే నేను స్టూడియో నుండి బయటకు వచ్చినప్పుడు మాత్రం సహాజంగా నాముఖం ఎలా ఉంటుందో అలానే ఉండడానికి ఇష్టపడతానని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. క్యాటీ మోస్ ఎప్పుడైనా తను ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు మాత్రం తన శిరోజాలకు మాత్రం కర్లింగ్ లేకుండా బయటకు రానని అన్నారు. అదేవిధంగా తన కనుబోమ్మలకు కూడా ఎప్పుడూ ఏదో ఒక ఐలైనర్ వేసుకోని మాత్రమే బయటకు వస్తానని తెలిపారు.


Click it and Unblock the Notifications











