ర్యాంప్ పై వయ్యారాలు ఎలా ఒలికించాలో, నేర్పించడానికే ఈస్కూలు..
క్యాట్ వాక్ రాణి కాటీ మోస్ త్వరలో తన ఓ మోడలింగ్ స్కూల్ పెట్టబోతున్నట్లు తెలిపారు. కాటీ మోస్ కుప్రపంచం మొత్తం మోడలింగ్ రంగంలో అభిమానులు ఉన్నారు. కాటీ మోస్ నుమోడలింగ్ క్వీన్ అని కూడా పిలుస్తూఉంటారు. అందుకే కాబోలు తను మేటిగా ఉన్నటువంటి మోడలింగ్ రంగంలోనే తను నేర్చుకున్నటువంటి కొన్ని సలహాలను, సూచనలను ఇతరులతో పంచుకోవడానికి ఈమోడలింగ్ స్కూల్ బాగా ఉపయోగపడుతుందని అన్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న యువత మోడలింగ్ రంగంలో బాగా రాణిస్తున్నారు. అటువంటి వారికి ర్యాంప్ పైతగు సూచనలను ఇచ్చామంటే ఇంకా వారు అభివృధ్ది లోకి వస్తారనేది నాఅభిప్రాయం అన్నారు. ఈసందర్బంలో కాటి మోస్ తను స్కూలు పేరును వివరిస్తూ కేట్స్ మోడలింగ్ స్కూల్ అని పేరు ఖరారు చేశారు. ఇక దానికి క్రింద టాగ్ లైన్ గా మోస్ మోడల్స్ ఉంటుందని అన్నారు. ఈసందర్బంలో ప్రపంచంలో ఉన్నటువంటి అందరి తెలివి అయినవాళ్శలో నేను ఒకదానినని, ఐతే నేను గ్యారంటీగా ఓమంచి టీచర్ నిఅవుతానో లేదో అనేది నాకు తెలియదని అన్నారు.


Click it and Unblock the Notifications











