నా నగ్న దృశ్యాలని నా పిల్లల్ని చూడనిస్తా

By Srikanya

తాను నగ్నంగా నటించిన దృశ్యంతో పాటు మొత్తం సినిమా చూడటానికి తన కూతురు మియా (11), కొడుకు జో (8)లను అనుమతిస్తానంటోంది కేట్‌ విన్‌స్లెట్‌. 'టైటానిక్‌' చిత్రం 3డి వెర్షన్‌ విడుదల సందర్భంగా హీరోయిన్‌ కేట్‌ విన్‌స్లెట్‌ అప్పటి జ్ఞాపకాల్ని నెమరువేసుకుంది. ఆ సినిమాలో ఈమెకు జంటగా నటించిన లియొనార్డొ డికాప్రియో కాస్త లావయ్యాడని, అయితే తాను మాత్రం మరింత నాజూగ్గా తయారయ్యానని పేర్కొంది.'డే బ్రేక్‌' అనే టెలివిజన్‌ షోలో ఈ విషయాలన్నీ చెప్పింది.

అలాగే...మేం కాస్త పెద్దవాళ్ళమయ్యాం. లియోకు ఇప్పుడు 37 ఏళ్ళు, నాకు 36. అప్పుడు లియోనార్డో కు 22, నాకు 21. ఈ యంగ్ ఏజ్ లో ఈ సినిమా తీశారు అంది. ఇక టైటానిక్‌ నౌక మునిగి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను 3డి ఫార్మాట్‌లో మరోమారు విడుదల చేస్తున్నారు. తెలుగులోనూ ఈ చిత్రం ఇక్కడ విడుదల అవుతోంది. ఈ చిత్రం మరోసారి చూడటానికి ప్రేక్షకులు రెడీ అవుతున్నారు.

లియోనార్డో డికాప్రియో, కేట్‌ విన్స్‌లెట్‌ కాంబినేషన్ లో వచ్చిన 'టైటానిక్‌'మళ్ళీ మరోసారి మన మనస్సులను దోచుకోవటానికి ముస్తాబవుతోంది. ఏప్రియల్ మొదటి వారంలో ఈ చిత్రం విడుదల చేయనున్నారు. ఈనాటి టెక్నాలిజీకి అణుగుణంగా అంటే త్రీడిలో రూపుదిద్దుకుంటోంది. 1997లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆస్కార్‌ అవార్డుల పంట పండించుకొంది. 'అవతార్‌' తరవాత జేమ్స్‌ మళ్లీ తన 'టైటానిక్‌'కే మెరుగులు దిద్దారు. మూడు సంవత్సరాలు కష్టపడి ఆ ప్రేమకథను త్రీడీలో ఆవిష్కరించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 15 న విడుదల కానుంది.

ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌ సంస్థ 'టైటానిక్‌ త్రీడీ' చిత్రాన్ని మన దేశంలో విడుదల చేయనుంది. ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ ''టైటానిక్‌ని త్రీడీలో చూడడం ఓ మర్చిపోలేని అనుభూతి. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దారు. మరోసారి జేమ్స్‌ మాయ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది''అన్నారు. అసాధారణ ప్రేమకథాచిత్రంగా, దృశ్యకావ్యంగా ప్రశంసలందుకున్న 'టైటానిక్‌' చిత్రం ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌ ద్వారా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌ ప్రతినిధి మాట్లాడుతూ.. 'టైటానిక్‌' చిత్రం 3డి వెర్షన్‌ రూపకల్పన 2009లో మొదలైంది. 2012 ఏప్రియల్ 15కల్లా టైటానిక్ ఓడ మునిగిపోయి వందేళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా ఈ ప్రేమకథను మరోసారి త్రీడి ఫార్మెట్ లో ఆవిష్కరించనున్నారన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X