For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ సెక్స్ సీన్ లో 'అది' మారుస్తా అని డైరెక్టర్ ఆఫర్.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన కేట్ విన్స్ లెట్!

  |

  ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన 'టైటానిక్' సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన రొమాంటిక్ క్లాసికల్ కల్ట్ మూవీ అది. టైటానిక్ షిప్ మునిగిపోతున్న సమయంలో హీరో, హీరోయిన్ల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ కేట్ విన్స్ లెట్ కు చాలా పేరు వచ్చింది. అయితే తాజాగా ఈ భామ తాజా సినిమా న్యూడ్ సీన్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  టైటానిక్ క్రేజ్

  టైటానిక్ క్రేజ్

  1997లో వచ్చిన టైటానిక్ లాంటి అద్భుత సినిమాని మర్చిపోవడం అంటే అంత ఈజీ కాదు. ఈ సినిమాలో నటించిన లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్ లెట్ జంటని ఇప్పటికి సినీ ప్రేమికులు గుర్తుంచుకుంటారు. 19 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఓ చరిత్ర సృష్టించింది. ఇక ఆ తరువాత అనేక సినిమాలతో ఆమె స్టార్ హీరోయిన్ అయింది. కామెరూన్ తెరకెక్కించిన 'అవతార్' సీక్వెల్ లో కూడా కేట్ నటిస్తోంది.

  మారుతూ ఉంటాయి

  మారుతూ ఉంటాయి

  నిజానికి మన శరీరాలు మన వయసుకు తగ్గట్టుగా మారుతూ ఉంటాయి. ప్రతి దశలో శరీరాకృతిని పొగిడే విధంగా ఉండకపోవచ్చు. మరీ ముఖ్యంగా ఎంటర్ టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్న వారి శరీరాలు ఎప్పటికీ ఎవర యంగ్ గా కనిపించాలని భావిస్తూ ఉంటారు. ఒక వేల ఏవైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సవరించడానికి వారికి సాధనాలు ఉన్నాయి.

  అది కనిపిస్తుండడంతో

  అది కనిపిస్తుండడంతో

  తాజాగా కేట్ విన్స్ లెట్ కు ఆమె మేర్ ఆఫ్ ఈస్ట్ టౌన్ డైరెక్టర్ క్రెయిగ్ జోబెల్ అలాంటి ఒక ఆఫర్ ఇచ్చారు. అయితే, ఆమె మాత్రం నిరాకరించింది. అసలు విషయం ఏంటంటే మేర్ ఆఫ్ ఈస్ట్ టౌన్ అనే కొత్త సిరీస్‌లో కేట్ విన్స్ లెట్ ఒక సెక్స్ సన్నివేశంలో నటించింది. ఈ సన్నివేశంలో ఆమె పొట్ట స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో దానిని ఎడిట్ చేస్తామని ఆయన కోరగా నటి దానికి నిరాకరించింది.

   డిటెక్టివ్ పాత్రలో

  డిటెక్టివ్ పాత్రలో

  మేర్ ఆఫ్ ఈస్ట్‌టౌన్‌లో, కేట్ విన్స్ లెట్ ఫిలడెల్ఫియా సమీపంలోని ఒక చిన్న పట్టణంలో జరిగిన హత్యపై దర్యాప్తు చేస్తున్న ఒక డిటెక్టివ్ పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఇంటర్వ్యూలో, ఆ సెక్స్ సన్నివేశం గురించి ఆమె మాట్లాడుతూ "పొట్ట భాగం లూస్ గా కనిపించడంతో దానిని తొలగించడానికి దర్శకుడు ప్రతిపాదించాడు, కానీ దానికి "మీకు అలా చూపే ధైర్యం లేదా." అని ప్రశ్నించానని పేర్కొంది.

  కోరికలు తీర్చమని వేధించేవాడు.. తట్టుకోలేకపోయా..
  పోస్టర్ కూడా రెండు సార్లు

  పోస్టర్ కూడా రెండు సార్లు

  ఇక ఈ క్రైమ్ డ్రామా యొక్క పోస్టర్ కూడా చాలా ఎడిట్ చేసినట్టు అనిపించడంతో ఆమె రెండు సార్లు తిరిగి పంపించిందని చెప్పుకొచ్చారు. నా కంటి పక్కన ఎన్ని ముడతలు ఉన్నాయో నాకు తెలుసు, దయచేసి అవన్నీ అలాగే ఉంచండి.' అని పేర్కొన్నారు.ఇక మేర్ ఆఫ్ ఈస్ట్‌టౌన్ విమర్శకులు మరియు ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఈ సిరీస్ ప్రస్తుతం భారతదేశంలో డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియంలో ప్రసారం అవుతోంది.

  English summary
  In Mare of Easttown, Kate Winslet played a detective role, who is investigating a murder in a small town near Philadelphia. In a recent interview, she revealed that a sex scene showed “bulgy bit of belly”, which the director offered to remove. But she denied the reqest.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X