ఆమె వొంపుసొంపుల కోసం పరితపిస్తున్నారు...!!
సినిమాల్లో నటించే హీరోయిన్లు తమ శరీర సౌష్టవాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంటారు. ఒక వేళ శరీరం అదుపు తప్పితే ఇక వారి కెరీర్ గాడీ తప్పినట్టే. అవకాశాలు గగనమైపోతాయి. దీంతో వారు మెరుపుతీగల్లా వుంటారు. వీరిని చూసి సాధారణంగా ప్రజలు వారిలా ఉండాలి అని అనుకుంటారు. వారి ఫిగర్ కోసం పరితపిస్తారు. సన్నగా, నాజూకుగా వుండే ఫిగర్ కోసం ఆడవారు ఆరాటపడతారు అనే అభిప్రాయం చాలా మందిలో వుంటుంది, కానీ దీనికి ఇటీవల నిర్వహించిన ఓ సర్వే చెక్ పెట్టింది.
ఈ సర్వేలో మీరు ఏ నటీమణిని పోలిన ఫిగర్ కావాలనుకుంటారు అనే ప్రశ్న మీద అభిప్రాయ సేకరణ జరుగగా మెజారిటీ మంది టైటానిక్ నాయిక కేట్ విన్స్లెట్ వొంపుసొంపులు అదుర్స్ అని, ఆమె లాంటి శరీరసౌష్టవాన్ని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆ తర్వాతి స్థానంలో టివీ వ్యాఖ్యాత, మోడల్ కెల్లీ బ్రూక్ నిలిచారు. మాజీ బాండ్ గర్ల్ నల్లకలువ హల్లే బెర్రీ, చెర్లీ కోలె, బేవన్స్, మేఘన్ ఫాక్స్, లిలే అల్లెన్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
బక్క భామలు విక్టోరియా బెక్ హాం, కేట్ మౌస్ లు ఈ సర్వేలో చివరి స్థానాల్లో నిలిచి సన్నగా వుండే వారి కంటే ఆరోగ్యకరమైన శరీరాన్ని కలిగి వున్న వారికే డిమాండ్ ఎక్కవని తేల్చిపారేసింది. సో.. అమ్మాయిలూ సన్నగా వుండాలనే ఆరాటంలో డైటింగులు గట్రాలు చేసి ఆరోగ్యాన్ని పాడుచేసుకోక చక్కటి ఆరోగ్యకరమైన శరీరం కోసం ప్రయత్నాలు చేయండి.


Click it and Unblock the Notifications











