విడిపోయిన ఆ దర్శకుడు..హీరోయిన్ తిరిగి కలసిపోయారు
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నటి, టైటానిక్ తార కేట్ విన్స్లెట్ ఇటీవలే తన భర్త, దర్శకుడు శ్యామ్ మెండీస్ కు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. విడాకులు తీసుకుని నెల కూడా కాకముందే వీరిద్దరూ తిరిగి కలసిపోయారు. దీనికి కారణం వీరిద్దరూ ఒకరినొకరు విడిచి వుండలేకపోవడం కాదు.. తమ పిల్లలకోసమేనట. వీరిద్దరికీ ఆరేళ్ల వయసు వున్న ఓ కొడుకు వున్నాడు. కాగా కేట్ కు తన తొలి వివాహానికి ప్రతిఫలంగా తొమ్మిదేళ్ల కూతురు మియా హనీ వుంది.
ఈ పిల్లలిద్దరూ మెండీస్ ను వదలి వుండలేకపోవడంతో వీరి భవిష్యత్తును దృష్టిలో వుంచుకొని వీరిద్దరూ కలసిపోయారట. మరీసారయినా కలకాలం కలసి వుంటారో లేక మధ్యలోనే విడిపోతారో మరి..!?
కేట్ విన్స్లెట్ ఆస్కార్ శ్యామ్ మెండీస్ హాలీవుడ్ విడాకులు kate winslet oscar awards sam mendes hollywood divorce


Click it and Unblock the Notifications