మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న టైటానిక్ నాయిక..!!
టైటానిక్ సినిమా తో ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్న తార కేట్ విన్స్లెట్. తన అందచందాలతో పాటు నటనతో కూడా ఆకట్టుకుంటున్న ఈ భామకు 2009 వ సంవత్సరం బాగా కలసి వచ్చిందని చెప్పవచ్చు. ఆమె నటించిన 'ది రీడర్' సినిమాలో ప్రదర్శించిన నటనాప్రతిభ కు గాను ఆమెను ఎన్నో అవార్డులు వరిస్తున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు ను సొంతం చేసుకున్న ఆమెను మరో అవార్డు వరించింది.
గత వారాంతంలో ప్రకటించిన మరో ప్రతిష్టాత్మక అవార్డులు యూరోపియన్ ఫిల్మ్ అవార్డుల్లో ఆమె ఉత్తమ నటిగా ఎంపికయింది. జర్మనీలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరు కాకపోవడంతో ఈ సినిమా దర్శకుడు స్టిఫెన్ డాల్డ్రీ ఆమె తరపున ఈ అవార్డును అందుకున్నాడు. కాగా ఈ అవార్డుల్లో భారతీయ చిత్రం, ఆస్కార్ ల పంట పండించుకున్న చిత్రం 'స్లమ్ డాగ్ మిలియనీర్' ను పీపుల్స్ ఛాయిస్ అవార్డు వరించింది.


Click it and Unblock the Notifications











